
‘బాలయ్య బాబు’కు క్రేజ్ తగ్గిన మాట వాస్తవం. ఓ దశలో బాలయ్య సినిమాకి గట్టిగా నాలుగు కోట్లు కూడా రాని పరిస్థితి కనిపిచింది. విజయ్ దేవరకొండ లాంటి హీరో సినిమాలు కూడా స్టార్ హీరో సినిమాలా చలామణి అవుతుంటే.. మొన్నటివరకు బాలయ్య సినిమాలు కొనేవాడే లేడు. ఒకప్పుడు బాలయ్య చుట్టూ డైరెక్టర్లు వెంట పడేవాళ్ళు.
అయితే, 2004 నుండి బాలయ్యతో సినిమా చేయాలని ఏ స్టార్ డైరెక్టర్ (ఒక్క బోయపాటి శ్రీను తప్ప) ఇంట్రెస్ట్ చూపించక పోవడం నిజంగా విచిత్రమే. దీనికితోడు ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య పరువును తీసేశాయి. ఇక బాలయ్య పని అయిపోయింది అనుకున్నారు అంతా. ఈ క్రమంలో బోయపాటితో చేస్తోన్న అఖండ సినిమాని కూడా ఎవ్వరూ పట్టించుకోరు, ఇది మరొక డిజాస్టర్ అనుకున్నారు.
కానీ అఖండ టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. బాలయ్యకి ఇప్పటికీ ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అని షాక్ అయ్యేలా ఏకంగా 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. ట్రేడ్ వర్గాలు సైతం బాలయ్య టీజర్ కి వస్తోన్న స్పందన చూసి షాక్ అయ్యారు. మొత్తానికి బాలయ్యకు సరైన సినిమా పడితే.. రికార్డ్స్ ను బ్రేక్ చేయగల సత్తా బాలయ్యలో ఇంకా ఉందని దర్శకనిర్మాతలలో నమ్మకం పెరిగింది.
అందుకే ఇప్పుడు ఫామ్ లో లేని ముగ్గురు టాలెంటెడ్ డైరెక్టర్స్ బాలయ్య కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. వినాయక్ తో పాటు దర్శకుడు శ్రీవాసు, అలాగే వక్కంతం వంశీ కూడా బాలయ్య కోసం ఒక కథ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఎలాగూ అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ తరువాత బాలయ్యతో సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. అలాగే మైత్రీతో పాటు అశ్వినీదత్, మరియు దిల్ రాజు కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. మొత్తమ్మీద ‘అఖండ’ టీజర్ బాలయ్య రేంజ్ ను గుర్తుచేసింది.