Director VV Vinayak- Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల్లో మార్చేసాడనే చెప్పాలి..జనవాణి కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు ఉత్తరాంధ్ర కి వచ్చిన పవన్ కళ్యాణ్ పర్యటనకి కి అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిందో మనం చూస్తూనే ఉన్నాము..పవన్ కళ్యాణ్ బస చేస్తున్న నోవొటెల్ హోటల్ కి వేల సంఖ్యలో పోలీసులు చేరి అభిమానుల్లో గందరగోళం సృష్టించేసారు.

జనసేన పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు కి తరలించారు..తనని నమ్ముకున్న వారిని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేసి బైలు మీద అందరిని వెనక్కి రప్పించుకున్నాడు..ఆ తర్వాత నిన్న మంగళగిరి లో ఏర్పాటు చేసిన సమావేశం లో కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది..వైసీపీ పార్టీ నేతల విమర్శలకు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో విరుచుకుపడుతాడని ఎవ్వరు కలలో కూడా ఊహించలేదనే చెప్పాలి.
ఆయన మాట్లాడుతూ ‘తనని ఇంకోసారి ప్యాకేజి స్టార్ అని పిలిస్తే చెప్పు విరిగేటట్టు కొడుతాను ఒకొక్క వైసీపీ కొడుకుని’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుని చూపిస్తూ ఇచ్చిన స్పీచ్ సెన్సషనల్ గా మారింది..పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సోషల్ మీడియా లో పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు కానీ సినిమా ఇండస్ట్రీ నుండి మాత్రం కేవలం ఒక్కడే పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చెయ్యడానికి ముందుకి వచ్చాడు..ఆయనే ప్రముఖ మాస్ డైరెక్టర్ VV వినాయక్..నిన్న ఆయన తన ఫేస్ బుక్ పేజీ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ని అప్లోడ్ చేస్తూ స్వచ్చందంగా మద్దతు తెలిపాడు.

మెగా కుటుంబ సభ్యులు కూడా రాజకీయ కోణం లో జరిగే సంఘటనలకు దూరంగా ఉంటూ వస్తున్నా ఈ తరుణంలో VV వినాయక్ స్వచ్చందంగా పవన్ కళ్యాణ్ కి సపోర్టు చెయ్యడానికి ముందుకి రావడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే..VV వినాయక్ ని చూసి ధైర్యంగా ఇంకా ఎవరైనా పవన్ కళ్యాణ్ కి సినిమా ఇండస్ట్రీ నుండి సపోర్ట్ చెయ్యడానికి వస్తారో లేదో చూడాలి.