Mahesh Babu -Director Vishnuvardhan
Mahesh Babu : మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ శివార్లలో రాజమౌళితో ఆయన చేస్తున్న మొదటి మూవీ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ తంతును అత్యంత రహస్యంగా ముగించారు. మీడియాకు అనుమతి లేదు. చివరికి ఫోటోలు కూడా విడుదల చేయలేదు. ఈ పూజా కార్యక్రమం జరిగిన అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగిందనే పుకార్లు కూడా ఉన్నాయి.
ప్రధాన షెడ్యూల్ కెన్యా దేశంలోని అడవుల్లో సాగనుంది. ఎస్ఎస్ఎంబి 29 యాక్షన్ అడ్వెంచర్ డ్రామా. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. రాజమౌళి, కీరవాణిలతో ప్రియాంక చోప్రా కలిసి దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ క్రమంలో మహేష్ కి జంటగా ప్రియాంక చోప్రా నటించడం అనివార్యమే అంటున్నారు. ఇది పాన్ వరల్డ్ మూవీ కావడంతో హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న ఆమెను ఎంపిక చేశారని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. మహేష్ బాబు ప్రైవేట్ మేటర్ ఒకటి లీకైంది. ఆయనతో కలిసి చదువుకున్న ఓ వ్యక్తి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయనెవరో కాదు దర్శకుడు విష్ణువర్థన్. మహేష్ బాబు బాల్యం చెన్నైలో సాగింది. స్కూలింగ్, కాలేజ్ చదువులు కూడా అక్కడే పూర్తి చేశాడు. ఈ క్రమంలో పలువురు నటులు, దర్శకులు, నిర్మాతల పిల్లలతో పాటు మహేష్ బాబు చదువుకున్నారు. సూర్య కూడా మహేష్ బాబు క్లాస్ మేట్ అని సమాచారం.
విష్ణు వర్ధన్ తండ్రి పట్టియల్ కే శేఖర్.. నటుడు, నిర్మాత. విష్ణువర్థన్ తమిళ్ బిల్లా , ఆరంభం వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ తో తెలుగులో పంజా తెరకెక్కించారు. ఈ సినిమా నిరాశపరిచింది. విష్ణువర్థన్ బాల్యంలో మహేష్ బాబుతో తనకున్న అనుబంధం, ఆనాటి చిలిపి చేష్టలు గుర్తు చేసుకున్నారు. ప్యాకెట్ మనీ కోసం వీరు చిన్న చిన్న దొంగతనాలు చేసేవారట. స్కూల్ లో ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసి అమ్మేసేవారట. సబ్జెక్టు ఏదైనా కానీ… రూ. 500 ఇస్తే ఒక పేపర్ ఇచ్చేసేవారట. ఈ విషయం చెబుతున్నందుకు మహేష్ బాబు నన్ను క్షమించాలని.. విష్ణువర్థన్ సరదాగా అన్నారు.
మహేష్ బాబులో ఈ యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మహేష్ బాబు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. అయితే ప్రెస్ మీట్స్ లో ఆయన తనలోని హ్యూమర్ యాంగిల్ బయటకు తీస్తాడు. కొన్ని ప్రశ్నలకు ఆయన వేసే పంచులు, సెటైర్స్ నవ్వులు పూయిస్తాయి.