Tollywood Heroes
Tollywood : ఒకప్పుడు రవితేజ మినిమమ్ గ్యారంటీ హీరో. టాక్ తో సంబంధం లేకుండా ఆయనకు సినిమాలకు వసూళ్లు ఉండేవి. ప్లాప్స్ తో వెనుకబడ్డ రవితేజ క్రాక్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. మళ్ళీ పరాజయాలు మొదలయ్యాయి. ధమాకాతో మరో విజయం ఖాతాలో వేసుకుని ఫార్మ్ లోకి వచ్చాడు. ధమాకా అనంతరం రవితేజ నటించిన ఒక్క సినిమా ఆడలేదు. లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ డిజాస్టర్. ఆయన కెరీర్ ప్రమాదంలో పడింది.
అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన థాంక్యూ, కస్టడీ డిజాస్టర్స్ అయ్యాయి. నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయిన నాగ చైతన్యకు ఒక సాలిడ్ హిట్ కావాలి. తండేల్ తో తన కోరిక నెరవేరుతుందని భావిస్తున్నాడు. నాగ చైతన్యకు కూడా అర్జెంటుగా హిట్ కావాలి. ఇస్మార్ట్ శంకర్ విడుదలై ఆరేళ్ళు అవుతుంది. రామ్ పోతినేనికి మరో హిట్ లేదు. రెడ్, వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు నిరాశపరిచాయి.
మెగా హీరో వరుణ్ తేజ్ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. ఎఫ్ 2 తర్వాత ఆయనకు హిట్ లేదు. ఎఫ్ 3 యావరేజ్. ఇవి రెండు వెంకీతో చేసిన మల్టీస్టారర్స్. సోలోగా చేసిన చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ఆయన గత చిత్రం మట్కా దారుణ ఫలితం అందుకుంది.నితిన్ కి ఒక్క హిట్ ఇస్తే అరడజను ప్లాప్స్ పడతాయి. 2020లో వచ్చిన భీష్మ అనంతరం ఆయనకు హిట్ లేదు. రాబిన్ హుడ్ పైనే ఆశలు పెట్టుకుని ముందుకు వెళుతున్నాడు.
ఇక శర్వానంద్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సక్సెస్ చూసి ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఎలాంటి ప్రయోగం చేసినా ఫలితం దక్కడం లేదు. ఆయన గత చిత్రం మనమే ప్లాప్ ఖాతాలో చేరింది. ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారి టైటిల్ తో రొమాంటిక్ లవ్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమా హిట్ కాకపోతే శర్వానంద్ కి కష్టమే. అతి తక్కువ కాలంలో 50 సినిమాలు పూర్తి చేసిన హీరో అల్లరి నరేష్. మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఒక్క హిట్ అంటూ విశ్వప్రయత్నం చేస్తున్నాడు. జోనర్స్ మార్చినా ఫలితం మారడం లేదు.
ఇక హీరోగా గోపీచంద్ కెరీర్ ముగిసినట్లే అనిపిస్తుంది. ఆయన చివరి హిట్ మూవీ జనాలకు గుర్తు కూడా లేదు. వరుస పరాజయాలతో రేసులో వెనకబడ్డాడు. మరో అక్కినేని వారసుడు అఖిల్ గత చిత్రం ఏజెంట్ ఆల్ట్రా డిజాస్టర్. ఈ స్టార్ కిడ్ హీరోగా నిలదొక్కుకునేందుకు బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ హీరోలందరినీ ఒక్క హిట్ సేవ్ చేయగలదు. అయితే హిట్ కొట్టడం అంత సులభం కాదు..