https://oktelugu.com/

Director Trivikram : త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదా..? ఆయన మౌనం వెనుక కారణం ఏంటి..?

మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : June 3, 2024 / 07:22 PM IST

    Trivikram Srinivas

    Follow us on

    Director Trivikram : తెలుగులో ఒకప్పుడు జంధ్యాల లాంటి గొప్ప రచయిత సినిమా ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ వరుస సక్సెస్ లను అందుకున్నారు. ఇక ఆయన తర్వాత ఇండస్ట్రీకి చాలా మంది రైటర్లు వచ్చినప్పటికీ వాళ్ళ మార్క్ ని మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత జంధ్యాలకి వారసుడిగా కొనసాగడమే కాకుండా ఆయన లేని లోటును కూడా తీరుస్తూ వస్తున్నారు.

    ఇక ఇప్పుడు ఆయన వరుస సినిమాలను డైరెక్ట్ చేస్తూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కూడా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేదు. ఇక దాంతో త్రివిక్రమ్ కొద్ది వరకు డీలాపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు ఆరు నెలలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకైతే త్రివిక్రమ్ మరొక సినిమాని అనౌన్స్ చేయలేదు.

    ఇక గుంటూరు కారం సినిమాకి ముందు అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తాడు అనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు మీద అటు అల్లు అర్జున్ గానీ, ఇటు త్రివిక్రమ్ కానీ ఎవరూ కూడా సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. అయితే ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు మాత్రం త్రివిక్రమ్ పని అయిపోయిందా ఇన్ని రోజులపాటు త్రివిక్రమ్ ఖాళీగా ఎప్పుడూ లేడు ఒక సినిమా అయిపోయిన వెంటనే మరొక సినిమా అనౌన్స్ చేసి ఆ సినిమా పనుల్లో బిజీగా ఉండేవాడు.

    ఇప్పుడు మాత్రం ఆరు నెలలు ఖాళీగా ఉండటం అనేది త్రివిక్రమ్ యొక్క వైఫల్యాన్ని సూచిస్తుంది అంటూ విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడా లేదా మరొక హీరో తో సినిమా చేయబోతున్నాడా అనే విషయాల పైన స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…