https://oktelugu.com/

WhatsApp : యూజర్లకు వాట్సప్ గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్య ఉండదు..

వినియోగదారులు తమ ఇష్టానుసారం చాట్ తొలగింపు లేదా కొనసాగింపు, అనుసంధానం వంటివి చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2024 / 07:12 PM IST

    WhatsApp

    Follow us on

    WhatsApp : మూడు బిలియన్ల యూజర్లతో అతిపెద్ద మెసేజింగ్ యాప్ గా వాట్సప్ ఆలరారుతోంది. తన యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ఆకట్టుకుంటున్నది. తాజాగా తన యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు చాట్ ఫిల్టర్ పేరుతో మరో అప్డేట్ తీసుకొచ్చింది. దీనివల్ల వినియోగదారులు సులభంగా యాక్సెస్ చేసేందుకు.. వారికి ఇష్టమైన చాట్ జోడించేందుకు.. ఫిల్టర్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

    ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశ విజయవంతంగా దాటింది. దీనిని మరింతగా డెవలప్ చేసేందుకు వాట్సప్ ప్రయత్నాలు చేస్తోంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం ద్వారా టెస్టర్లను నమోదు చేసుకున్న నేపథ్యంలో.. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. డెవలపర్లు ఈ ఫీచర్ లో మార్పులు, చేర్పులు చేసిన తర్వాత.. యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

    ప్రస్తుతం యువత మంచి మొదలు పెడితే వృద్ధుల వరకు వాట్సప్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా మెసేజింగ్ యాప్ లలో వాట్సప్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాట్సప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. యూజర్లు అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తోంది. కొత్త కొత్త అప్డేట్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే యాక్సెస్ సులభంగా చేయడం, ఇష్టమైన చాట్ జోడించడం, ఫిల్టర్ చేయడానికి అనువుగా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెస్తుంది..

    ఆండ్రాయిడ్ 2.24.12.7 వెర్షన్ వారి కోసం వాట్సప్ బీటా లో ఈ కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే చాట్ లను సెట్ చేసేందుకు, వారికి ఇష్టమైన వాటిని జోడించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఫిల్టర్ యూజర్లు తమ సాధారణ పరిచయాల నుంచి ఇతరులను వేరు చేసేందుకు సహాయం చేస్తుంది. చాట్ ను పిన్ చేయడంతో పాటు, అప్ గ్రేడ్ కూడా చేస్తుంది.. సాధారణంగా వాట్సప్ మూడు కంటే ఎక్కువ చాట్ లను పిన్ చేసేందుకు మాత్రమే అనుమతిస్తుంది. ఇక కొత్త ఫీచర్ ప్రకారం.. యూజర్ ఇంటర్ ఫేస్ కు మరొక ఎంపికను అదనంగా అందిస్తుంది.

    వాట్సప్ బీటా ఇన్ ఫోన్ నివేదిక ప్రకారం యూజర్లు తమకు ఇష్టమైన చాట్ కు సంబంధించి స్క్రీన్ షాట్ ను భాగస్వామ్యం చేసుకోవచ్చు. అంతేకాదు యాడ్ టు ఫేవరెట్ అనే ఆప్షన్ ట్యాగ్ చేయడం ద్వారా యూజర్లు చాట్ లను మాన్యువల్ గా ఫేవరెట్లకు యాడ్ చేసుకోవచ్చు. ఇదే క్రమంలో వినియోగదారులు తమ ఇష్టానుసారం చాట్ తొలగింపు లేదా కొనసాగింపు, అనుసంధానం వంటివి చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.