
Trinadha Rao Nakkina: దర్శకుడు ‘త్రినాథరావు నక్కిన’ కు చిన్న సినిమాల కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. అయితే, ఎప్పటి నుంచో త్రినాథరావు నక్కిన పై ఉన్న విమర్శ. ఆయన ఎక్కువగా రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ పై ఆధారపడతాడు అని, అసలు ప్రసన్న కుమారే డైరెక్షన్ చేస్తాడని, త్రినాథరావు నక్కిన కేవలం పేరుకే దర్శకుడు అని ఇలా చాన్నాళ్లుగా ఒక పుకారు ఉంది.
ఇప్పుడు అదే త్రినాధరావుకి పెద్ద తలనొప్పి అయిపోయింది. నక్కిన ప్రస్తుతం రవితేజతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కూడా ప్రసన్న కథ – మాటలు రాశాడు. దాంతో అతను కూడా సెట్ కి వెళ్తున్నాడు. మొదట్లో సైలెంట్ గా ఉన్నా.. మధ్యలో అతనిలో డైరెక్టర్ నిద్ర లేచాడు. హీరో ఎలా యాక్ట్ చేయాలి ? అసలు సీన్ పేపర్ లో ఏముంది ? లాంటి విషయాలు కూడా ప్రసన్న చెప్పేస్తున్నాడట.
నక్కినకు చెప్పే అవకాశం కూడా లేకుండా పోయిందని.. రవితేజ కూడా ప్రసన్న వైపు చూస్తున్నాడని మొత్తానికి త్రినాథరావు నక్కిన డమ్మీ డైరెక్టర్ మరోసారి రుజువు అయ్యాడని యూనిట్ లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో నక్కిన ప్రసన్న పై సీరియస్ అయ్యాడు. ఇక నుంచి నా సెట్ లో నువ్వు కనపడకూడదు అంటూ ఆర్డర్స్ కూడా పాస్ చేశాడట. అయితే, హీరో ప్రసన్న వైపు ఉన్నాడు కాబట్టి.. ఆ ఆర్డర్స్ చెల్లవు అనుకోండి.
నిజానికి ప్రసన్నను డైరక్షన్ చేయమని అప్పట్లో త్రినాథరావు నక్కిననే బాగా ప్రోత్సహించాడు. ప్రసన్న కూడా ఒక కథ పట్టుకుని డైరెక్షన్ కోసం కొంతమంది హీరోలను కలిశాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా ప్రసన్నకు ఎవరూ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో తాను ఇంకా బాగా అనుభవం పొందాలి అని మళ్ళీ తిరిగి నక్కిన దగ్గరకే వచ్చేశాడు.
త్రినాథరావు నక్కిన( Trinadha Rao Nakkina) – ప్రసన్నలది హిట్ కాంబినేషన్ కాబట్టి.. నిర్మాతలు కూడా ఈ కలయికను ఎంకరేజ్ చేశారు. కానీ చివరకు త్రినాధరావు నక్కిన జస్ట్ దర్శకత్వ పర్యవేక్షకుడిగా మళ్ళీ పేరు పడాల్సి వచ్చింది. అయినా రచయిత అయి ఉండి.. దర్శకత్వంతో అన్నీ తానే చూసుకోవడాలనుకోవడం ప్రసన్నకుమార్ కెరీర్ కే నష్టం. ప్రస్తుతానికైతే రవితేజ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.