Ira Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమిర్‌ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ గత కొద్దిరోజులుగా నుపూర్ షిఖరే అనే వ్యక్తితో ప్రేమలోఉన్న విషయం అందరికీ తెలిసిందే. గతేడాది దీపావళి నాడు తొలిసారి తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది ఐరా. అప్పటి నుంచి వీరిద్దరి డేటింగ్ వ్యవహారం బాలీవుడ్ మొత్తం హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా, ఈ దీపావళి పండుగను తన ప్రియుడితో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫొటోలో నుపూర్ తల్లి ప్రీతమ్ కూడా ఉన్నారు. ఆమె కూడా వీరితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇకపోతే, నుపూర్ బాలీవుడ్లో పలువురు స్టార్ హీరో, హీరోయిన్లకు ఫిట్‌నెట్ ట్రైనర్‌గా ఉన్నారు. సుస్మితా సేన్‌కు గత పదేళ్లుగా ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిర్ఖాన్కూ ఫిట్‌నెట్ ట్రైనర్‌గా ఉంటున్నారు నుపూర్. కాగా, ఐరాకు కూడా ఆయన కోచ్‌గా ఉన్నారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
మరోవైపు దంగల్ సినిమాలో జాతీయ స్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు అమీర్‌ఖాన్. అదే జోరుతో ఫారెస్ట్ గంప్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో సింగ్‌గా అమిర్‌ఖాన్ కనిపంచనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇందులో టాలీవుడ్ హీరో నాగచైతన్య కడా అలరించనున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.