Director Teja: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. వాళ్ళని చూసే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. కాబట్టి వాళ్ల సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి. దాంతో ప్రేక్షకుల్లో వాళ్లకు విశేషమైన ఆదరణ దక్కుతోంది. తద్వారా వాళ్లు రెమ్యూనరేషన్ ని కూడా భారీ రేంజ్ లో పెంచే అవకాశాలైతే ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇప్పుడు వందల కోట్లు దాటిపోతున్నాయి అంటే దానికి కారణం వాళ్ళు అందుకుంటున్న సక్సెస్ లనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకుంది. కాబట్టి ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో మన దర్శకులు, హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఒకప్పుడు ‘చిత్రం’ సినిమాతో సక్సెస్ ను సాధించి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు తేజ… ఆ తర్వాత చేసిన నువ్వు నేను, జయం సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన కొత్త నటీనటులతో సినిమాలు చేయడమే ఏజెండాగా పెట్టుకొని చాలామంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోని కూడా డైరెక్షన్ చేయలేదు. ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్టార్ హీరోలతో మీరు ఎందుకు సినిమాలు చేయరు అని అడిగినప్పుడు ఆయన దానికి సమాధానం చెబుతూ స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే కెపాసిటి తన దగ్గర లేదని అందుకోసమే చేయలేనని చెప్పాడు.
ఇంకా గట్టిగా అడిగితే రజినీకాంత్, కమల్ హాసన్, అమిత బచ్చన్, మహేష్ బాబు లతో చేయవచ్చని చెప్పాడు. కానీ కొంతమందితో మాత్రం అస్సలు చేయలేము…అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు… ఆయనలాంటి హీరోని మనం హ్యాండిల్ చేయడం చాలా కష్టం…ఎందుకంటే వాళ్ళు ఒక డై లో ఉంటారు…ఇక ఎన్టీఆర్ తో పోలిస్తే బాలకృష్ణ ను కొంత వరకు హ్యాండిల్ చేయొచ్చు అంటూ ఆయన ఒక షాకింగ్ కామెంట్ చేశాడు.
తేజ చెప్పిన దాని బట్టి ఆయన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ డమ్ ను మ్యాచ్ చేసే సినిమా తను చేయలేనని చెప్పాడా? లేదంటే జూనియర్ ఎన్టీఆర్ తో మనకెందుకులే అనే అర్థం వచ్చేలా చెప్పాడా? అనే దాని మీదనే కన్ఫ్యూజన్ వచ్చింది…ఇక తేజ చేసిన కామెంట్స్ చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంతవరకు తేజ మీద ఫైర్ అవుతున్నారు…