Sukumar’s Wife: సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన ఆర్య సినిమా నుంచి మొన్న వచ్చిన పుష్ప సినిమా దాకా ప్రతి సినిమాలో వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకొని, ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా సినిమాలు చేయడంలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరనే చెప్పాలి. ఇక ఇలాంటి సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే సుకుమార్ భార్య అయిన ‘తబిత ‘ ఎప్పుడు పెద్దగా పబ్లిక్ ఫంక్షన్స్ కి అయితే అటెండ్ అవ్వదు. అయినప్పటికీ రీసెంట్ గా తన సోషల్ మీడియాలో సాంప్రదాయమైన బట్టలను ధరించి, విలువైన నగలను అలంకరించుకొని దిగిన ఫోటోలు ఇప్పుడు అప్లోడ్ చేసింది. దాంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొత్తానికైతే ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక చాలా మంది సుకుమార్ గారి భార్య చాలా సాంప్రదాయబద్ధంగా ఉంది. లక్షణమైన తెలుగు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో అలాంటి క్వాలిటీస్ తో సుకుమార్ గారి భార్య ఉండడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలను చూసిన చాలా మంది లెక్కల మాస్టారు గారి భార్య చాలా పద్ధతిగా ఉన్నారు, ఇప్పుడున్న హీరోయిన్ల కంటే తనే చాలా అందంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు…
మొత్తానికైతే సుకుమార్ పబ్లిక్ ఫంక్షన్స్ లో తన ఫ్యామిలీని పరిచయం చేయడానికి పెద్దగా ఇష్టపడడు. దానివల్లే తబిత తన భార్య అనే విషయం చాలా మందికి తెలియదు. అయినప్పటికీ సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారికి మాత్రం తబిత గురించి ఒక ఐడియా ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే సుకుమార్ పుష్ప 2 సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు.
తను ఎంత సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న పిల్లల బాధ్యత మొత్తాన్ని తబిత నే చూసుకుంటారని ఇప్పటికి చాలాసార్లు సుకుమార్ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం..తన సక్సెస్ లో ఆయన భార్య పాత్ర కూడా చాలా వరకు ఉందని సుకుమార్ చాలా సార్లు చెబుతూ ఉంటాడు…
View this post on Instagram