Director Sukumar: హద్దులు దాటిపోయిన డైరెక్టర్ సుకుమార్ రెమ్యూమరేషన్

Director Sukumar: మన టాలీవుడ్ నుండి దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అంతతి క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే మనకి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్..టాలీవుడ్ లో ఎప్పుడు మోస్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసే సుకుమార్ అంటే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది..ఇక లేటెస్ట్ గా పుష్ప సినిమా తో ఆయన దేశ వ్యాప్తంగా అన్ని బాషలలో సృష్టించిన ప్రభంజనం […]

Written By: Neelambaram, Updated On : May 31, 2022 4:29 pm

Director Sukumar

Follow us on

Director Sukumar: మన టాలీవుడ్ నుండి దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అంతతి క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే మనకి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్..టాలీవుడ్ లో ఎప్పుడు మోస్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసే సుకుమార్ అంటే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది..ఇక లేటెస్ట్ గా పుష్ప సినిమా తో ఆయన దేశ వ్యాప్తంగా అన్ని బాషలలో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి భాషకి చెందిన ప్రేక్షకులతో ‘తగ్గేదేలే’ అని అనిపించాడు..ఇటీవల కాలం లో ఈ స్థాయి మేనియా ని సృష్టించిన సినిమా మరొక్కటి లేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇప్పుడు అందరూ ఆయన త్వరలో తెరకెక్కించబోయ్యే పుష్ప పార్ట్ 2 కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తున్నారు..బాహుబలి సిరీస్ మరియు KGF సిరీస్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ ని ఏర్పర్చుకున్న సిరీస్ పుష్ప మాత్రమే.

Sukumar

Also Read: Rajendra prasad- Anchor Manjusha: నటుడు సీరియస్.. అలిగి వెళ్లిపోయిన యాంకర్ మంజూష

పుష్ప తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోవడం తో తన రెమ్యూనరేషన్ ని కూడా భారీ స్థాయిలో పెంచేసాడట సుకుమార్..పుష్ప సినిమాకి ముందు సుకుమార్ ఒక్కో సినిమాకి 35 నుండి 40 కోట్ల రూపాయిల వరుకు పారితోషికం పుచ్చుకునేవాడట..రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం చిత్రం భారీ ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో, తన తదుపరి చిత్రం పుష్ప కి ఏకంగా 40 కోట్ల రూపాయిల వరుకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..ఇప్పుడు పుష్ప కూడా భారీ హిట్ అవ్వడం తో పుష్ప పార్ట్ 2 కోసం ఆయన ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇప్పటి వరుకు సౌత్ ఇండియా లో కేవలం రాజమౌళి మరియు శంకర్ లు మాత్రమే తీసుకున్నారు..వాళ్ళిద్దరి తర్వాత ఆ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకున్న దర్శకుల జాబితాలో లేటెస్ట్ గా సుకుమార్ చేరి సరికొత్త ప్రభంజనం సృష్టించాడు..ఇక పుష్ప పార్ట్ 2 కూడా హిట్ అయ్యిపోతే ఈయన 70 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇప్పటికి స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసిన సుకుమార్..ఆగష్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోబోతున్న ఈ సినిమా గురించి ఒక్క టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు, అన్ని భాషలకు చెందిన సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Also Read: Superstar Krishna Birthday: సాహసం ఆయన ఊపిరి.. ధైర్యం ఆయన చిరునామా

Recommended Videos


Tags