https://oktelugu.com/

హైప్ కోసం సుకుమార్ తప్పుడు పని !

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాత‌గా కూడా వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నాడు. గత సినిమా ఉప్పెనతో భారీ కలెక్షన్స్ ను సాధించిన, సుక్కు క్రియేటివిటీకి మరో హిట్ దక్కింది. పైగా తన శిష్యుడికి అవకాశం ఇచ్చిన గురువుగా కూడా సుక్కుకి గౌరవం దక్కింది. అందుకే తన సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ మీద‌ మరిన్ని చిన్న సినిమాల్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే తన నిర్మాణ సారథ్యంలో పలు హిట్ సినిమాలను అందించాడు. Also Read: ‘హరిహర వీరమల్లు’ […]

Written By:
  • admin
  • , Updated On : March 12, 2021 / 04:30 PM IST
    Follow us on


    క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాత‌గా కూడా వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నాడు. గత సినిమా ఉప్పెనతో భారీ కలెక్షన్స్ ను సాధించిన, సుక్కు క్రియేటివిటీకి మరో హిట్ దక్కింది. పైగా తన శిష్యుడికి అవకాశం ఇచ్చిన గురువుగా కూడా సుక్కుకి గౌరవం దక్కింది. అందుకే తన సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ మీద‌ మరిన్ని చిన్న సినిమాల్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే తన నిర్మాణ సారథ్యంలో పలు హిట్ సినిమాలను అందించాడు.

    Also Read: ‘హరిహర వీరమల్లు’ టీజర్ పై స్పందించిన చిరంజీవి

    అయితే అందులో ‘కుమారి 21 ఎఫ్’, ‘ఉప్పెన’ సినిమాలకు భారీగా లాభాలు వచ్చాయి. ఇప్పుడు ఆ లాభాలనే పెట్టుబడిగా పెట్టి వేరే సంస్థలతో చేతులు కలిపి తన అసిస్టెంట్ లను డైరెక్టర్ లుగా పరిచయం చేస్తూ వరసగా సినిమాలను సుకుమార్ పక్కా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా కార్తికేయ హీరోగా మరో సినిమా ఉంటుందని ప్రకటించిన సుక్కు, ఈ సినిమాని న‌వంబ‌ర్ లో లాంచ్ చేస్తాడట.

    అన్నట్టు ఈ సినిమాకి క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు సుకుమారే అందిస్తున్నారని.. విడుదల చేసిన ప్రెస్ నోటులో చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాకి కథ మాటలను జనార్ధన్ అనే కొత్త కుర్రాడు రాశాడట. కాకపోతే.. సినిమాకి హైప్ క్రియేట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో రచయితగా సుక్కు తన పేరును వేసుకున్నాడని తెలుస్తోంది. అయినా సుక్కు లాంటి డైరెక్టరే వేరేవాళ్ళ క్రెడిట్ తీసుకుంటున్నప్పుడు ఇక చిన్నాచితకా డైరెక్టర్లు వేరేవాళ్ళ క్రెడిట్ కోసం ఎందుకు ఆశ పడరు.

    Also Read: కలెక్షన్లకు ‘శ్రీకారం’.. తొలిరోజు ఎంతంటే?

    కాగా వచ్చే వారం విడుదల కాబోతున్న కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమా హిట్ అయితే సుక్కు బ్యానర్ లో చేయబోయే సినిమాకి మరింత హైప్ వస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్