Director Sukumar: మెగా ఫ్యామిలీ హీరోలకు చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన సినిమాలను అందించిన దర్శకుడు సుకుమార్(Director Sukumar). ఆర్య, రంగస్థలం, పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ వంటి సంచలనాత్మక చిత్రాలను మెగా ఫ్యామిలీ కి అందించాడు. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప 2 ది రూల్'(Pushpa 2 : The Rule) చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల వరకు పుష్ప ప్రభావం జనాల మీద ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) తో కూడా ఆయన పీరియాడిక్ జానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇలా ఆయన కెరీర్ లో సంచలనాత్మకంగా నిల్చిన సినిమాలన్నీ మెగా హీరోలు అందించినవే. అలాంటి సుకుమార్ ఒక్కసారిగా ‘సాక్షి ఎక్సెలెన్స్ అవార్డ్స్'(Sakshi Excellence Awards) లో పాల్గొనడం సంచలనం రేపింది. ‘సాక్షి ఎక్సెలెన్స్ అవార్డ్స్’ ని ప్రతీ ఏడాది మాజీ సీఎం జగన్ సతీమణి భారతి గ్రాండ్ గా నిర్వహించే సంగతి తెలిసిందే.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క విషయంలో తగ్గాల్సిందేనా..?అట్లీ, త్రివిక్రమ్ లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు..?
ప్రతీ ఏడాది సూపర్ హిట్స్ గా నిల్చిన సినిమాలకు, అందులో నటించే నటీనటులకు, టెక్నీషియన్స్ కి అవార్డ్స్ ఇస్తుంటారు. గత ఏడాది పుష్ప 2 చిత్రం సంచలన విజయం సాధించింది కాబట్టి ఆ సినిమాకి కూడా పలు క్యాటగిరీస్ లో అవార్డ్స్ వచ్చాయి. వాటిని అందుకోవడానికి అల్లు అర్జున్ తరుపున సుకుమార్ వచ్చినట్టు చెప్తున్నారు విశ్లేషకులు. అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్లినప్పటి నుండి మీడియా లో ఏ స్థాయి నెగటివిటీ అతనిపై ఏర్పడిందో మన అందరికీ తెలిసిందే. అందుకే ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి వెళ్లాలని ఆయన మనసులో ఉన్నప్పటికీ, దాని వల్ల జరగబోయి పరిణామాలు తలచుకొని దూరంగా ఉన్నాడని, ఆయనకు బదులుగా సుకుమార్ ని పంపారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు. అయితే శత్రువు గడప తొక్కినందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుకుమార్ పై కోపంతో ఉన్నారు.
సుకుమార్ ని ఒక డైరెక్టర్ గా ఎంతో ప్రేమిస్తామని, ఇలా శత్రువులు నిర్వహించే ఈవెంట్స్ కి వెళ్తే, గతంలో జరిగిన పరిణామాలన్నిటిని కనెక్ట్ చేసుకొని, సుకుమార్ కూడా వైసీపీ పార్టీ కి సపోర్టు చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుందని పవన్ అభిమానులు అంటున్నారు. ఇకపోతే సుకుమార్ నిన్న మొన్నటి వరకు అబుదాబి లో ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో తీయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ని ఆయన అబుదాబిలో రాస్తున్నాడట. రామ్ చరణ్ కూడా ఒకరోజు సుకుమార్ ని కలిసి స్టోరీ ని వినొచ్చాడని, క్యాస్టింగ్ ని కూడా ఫైనలైజ్ చేసారని అంటున్నారు. ప్రస్తుతం బుచ్చి బాబు సినిమాతో బిజీ గా ఉన్న రామ్ చరణ్, ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ తో సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది లోనే అది జరగొచ్చని అంటున్నారు.
Also Read: ఈ ముగ్గురు దర్శకులను నట్టేట ముంచేసిన పవన్ కళ్యాణ్…