Sukumar , Ram Charan
Sukumar and Ram Charan : పుష్ప సిరీస్ తో పాన్ ఇండియన్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి, మన తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన డైరెక్టర్ సుకుమార్, తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) తో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘రంగస్థలం’ వంటి సేన్సేన్షనల్ బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కొనసాగుతున్న సుకుమార్(Director Sukumar) కెరీర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఇది. ముఖ్యంగా రామ్ చరణ్ లోని నట విశ్వరూపాన్ని బయటకి తీసాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయకుండా మూవీ టీం పెద్ద పొరపాటు చేసింది కానీ, లేకపోతే అప్పట్లోనే ఈ సినిమా నార్త్ ఇండియా లో సెన్సేషన్ సృష్టించి ఉండేదని, 500 కోట్ల గ్రాస్ రాబట్టేది అని, రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వచ్చేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు.
గత కొంతకాలంగా స్క్రిప్ట్ వర్క్ లో ఫుల్ బిజీ గా డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తన భార్య పిల్లలతో కలిసి మొన్న ఆయన దుబాయి లోని ఒక పెళ్లి వేడుకలో కనిపించడం, ఆ మరుసటి రోజు ఇండియా వెర్సస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో కనిపించడం జరిగింది. గత కొంతకాలం గా ఆయన అబుదాబి లోనే ఉంటున్నాడు. రామ్ చరణ్ గత వారం సుకుమార్ వద్దకు వెళ్లి ఫైనల్ స్క్రిప్ట్ న్యారేషన్ ని విన్నాడు. అదే విధంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించే విషయం పై కూడా చర్చలు జరిపాడు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు(Buchibabu Sana) దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు షెడ్యూల్స్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న ఈ చిత్రం, త్వరలోనే మూడవ షెడ్యూల్ ని ప్రారంభించుకోనుంది.
శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఎట్టి పరిస్థితిలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదే ఏడాది లో రామ్ చరణ్ సుకుమార్ సినిమాని కూడా మొదలు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది. పుష్ప క్యారక్టర్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా అయితే స్టార్ గా నిలబెట్టాడో, త్వరలో రామ్ చరణ్ తో చేయబోయే సినిమా ద్వారా, రామ్ చరణ్ కి అంతకు మించిన క్రేజ్ ని తీసుకొచ్చే విధంగా ఆయన క్యారక్టర్ ని తీర్చి దిద్దబోతున్నాడు. పీరియాడికల్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మిక ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. #RRR మూవీ షూటింగ్ సమయంలోనే సుకుమార్ ఈ సినిమాకి సంబంధించి ఆయన ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించాడట. రెగ్యులర్ షూటింగ్ దసరా నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.