OG Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు వరుస విజయాలు అందుకున్నాయి. యూత్ లో మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటివరకు పెద్దగా పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. దాంతో ఈ సంవత్సరం ‘హరిహర వీరమల్లు ‘ సినిమాతో పాన్ ఇండియా సినిమా చేసినప్పటికి ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కానీ ఓజీ సినిమాతో మాత్రం ఆయన పలు రికార్డులను క్రియేట్ చేస్తూ భారీ వస్తువులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక పవన్ కళ్యాణ్ స్టామినా చూడాలి అంటే ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలను మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన మ్యాజిక్ పెద్దగా పనిచేయడం లేదు.
కారణం ఏంటి అంటే ఆయన పాలిటిక్స్ లో ఫుల్ టైం యాక్టివ్ గా ఉండటం వల్ల సినిమాల మీద ఎక్కువ డేట్స్ కేటాయించలేకపోతున్నాడు. తను కేటాయించిన డేట్స్ లోనే దర్శకులు సినిమాలు చేయాలి అంటే కొంతవరకు కష్టంతో కూడుకున్న పనిగా మారుతోంది. కానీ సుజిత్ మాత్రం ఓజీ సినిమాకి ఆయన ఇచ్చిన డేట్స్ లోనే అడ్జస్ట్ చేసి మరి సినిమా తీశాడు.
దానికి నిజంగా ఆయనకు మనం హ్యాట్సాఫ్ చెప్పాలి. ఓజీ సినిమా కథని రాసుకున్నప్పుడు సుజిత్ చాలా వరకు హార్డ్ వర్క్ చేసారట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వాడిన కటానా కోసం బ్యాక్ స్టోరీ రెడీ చేశానని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. దానికోసం జపాన్ కి వెళ్లి అక్కడ ఎన్ని కటానాలు ఉన్నాయి. ఏ కటానా ఏ టైం లో వాడతారు… అనే విషయం మీద రీసెర్చ్ చేసి దానికోసం ఒక థియరీ రాసుకున్నాడట.
ఇక పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న కటానాకి బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. కానీ అది ఫ్లోకి కొంచెం అడ్డంగా రావడం వల్ల ఆ బ్యాక్ స్టోర్ ని సెకండ్ పార్ట్ లో ఆడ్ చేద్దామని తీసేసారట… మరి ఇప్పుడు ఓజీ యూనివర్స్ కూడా క్రియేట్ చేయబోతున్నారు. కాబట్టి సెకండ్ పార్ట్ లో దానికి సంబంధించిన బ్యాక్ స్టోరీని పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…