Pawan Kalyan OG Movie: అటు పాలిటిక్స్ ఇటు షూటింగ్స్ రఫ్ఫాడిస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న పవన్ నెక్స్ట్ మంత్ నుండి తిరిగి షూటింగ్స్ లో పాల్గొననున్నారని సమాచారం. హరి హర వీరమల్లు, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. బ్రో షూటింగ్ కంప్లీటయ్యింది. వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర వీరమల్లు కొంత మేర షూటింగ్ జరుపుకున్నాయి. కాగా ఓజీ మూవీ గురించిన లేటెస్ట్ అప్డేట్ మైండ్ బ్లాక్ చేస్తుంది.
దర్శకుడు సుజీత్ చక్కని ప్రణాళికతో 50 శాతం పూర్తి చేశాడట. మూడు షెడ్యూల్స్ లో అద్భుతమైన అవుట్ ఫుట్ తో చిత్రీకరణ చక చకా జరుపుతున్నాడట. ఈ చిత్ర రషెస్ చూసిన యూనిట్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారట. సుజీత్ ప్రతిభను కొనియాడుతున్నారట. ఓజీ మూవీలో కీలక రోల్ చేస్తున్న అర్జున్ దాస్ ఇప్పటికే ఈ విషయం వెల్లడించారు. ఓజీ చిత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందన్నారు.
ఇక ఓజీ నెక్స్ట్ షెడ్యూల్ జులై, ఆగష్టు నెలల్లో ప్లాన్ చేస్తున్నారట. మిగతా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారట. సుజీత్ స్పీడ్ చూస్తుంటే ఓజీ వచ్చే వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. ఓజీ అనగా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం. సాహో మూవీ అనంతరం నాలుగేళ్లుగా సుజీత్ మూవీ చేయలేదు. పవన్ కళ్యాణ్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ నుండి బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నాయి. నెలల వ్యవధిలో బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు విడుదల కానున్నాయి.