Rajamouli Bad Sentiment: మెగా డిజాస్టర్‌ : రాజమౌళి బ్యాడ్‌ సెంటిమెంట్‌ నిజమైంది

Rajamouli Bad Sentiment: తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్‌ ఏ రేంజ్‌ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టైటిల్‌ దగ్గర నుంచి క్యాస్టింగ్‌ వరకు అన్ని విషయాల్లోనూ కొంతమంది చాలా సెంటిమెంటుతో ముందుకు సాగుతూ ఉంటారు. ఒక్కసారి ఆ సెంటిమెంట్‌ సక్సెస్‌ అయ్యింది అంటే అలానే కంటిన్యూ అవుతుంది. ఇక కొన్ని బ్యాడ్‌ సెంటిమెంట్స్‌ కూడా ఉంటాయి. ఆ విషయంలో కూడా కొందరు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఆచార్య సినిమా రిజల్ట్‌ ప్రస్తుతం అనేక రకాల […]

Written By: NARESH, Updated On : April 30, 2022 5:18 pm
Follow us on

Rajamouli Bad Sentiment: తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్‌ ఏ రేంజ్‌ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టైటిల్‌ దగ్గర నుంచి క్యాస్టింగ్‌ వరకు అన్ని విషయాల్లోనూ కొంతమంది చాలా సెంటిమెంటుతో ముందుకు సాగుతూ ఉంటారు. ఒక్కసారి ఆ సెంటిమెంట్‌ సక్సెస్‌ అయ్యింది అంటే అలానే కంటిన్యూ అవుతుంది. ఇక కొన్ని బ్యాడ్‌ సెంటిమెంట్స్‌ కూడా ఉంటాయి. ఆ విషయంలో కూడా కొందరు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఆచార్య సినిమా రిజల్ట్‌ ప్రస్తుతం అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా విషయంలో మరోసారి రాజమౌళి బ్యాడ్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయినట్లుగా తెలుస్తోంది.

acharya

విడుదలకు ముందు..
మెగాస్టార్‌ చిరంజీవి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ కలిసి నటించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామా ఆచార్య సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. ఇక ఇప్పటి వరకు కమర్షియల్‌ గా నిరాశపరచని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించడంతో ముందే మంచి పాజిటివ్‌ వైబ్రేషన్స్ క్రియేట్‌ అయ్యాయి. టీజర్‌ ట్రైలర్‌ కూడా మంచి కిక్‌ ఇచ్చింది. కానీ విడుదలకు కొన్ని రోజుల ముందు ఈ సినిమాపై అనుకున్నంతగా హైప్‌ లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు మెగాస్టార్‌ చిరంజీవి సినిమా అంటేనే గతంలో ఒక ప్రత్యేకమైన సందడి కనిపించేది. పైగా రామ్‌ చరణ్‌ ఈ సినిమాలో నటిస్తుండడం అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత వస్తుండడం ఇలా అన్ని రకాల అంశాలు ఆచార్య సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తాయి అని అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది.

Also Read: Star Heroine: మత్తులో సర్వం కోల్పోతున్న స్టార్ హీరోయిన్ ?

నెగిటివ్‌ టాక్‌
ప్రపంచవ్యాప్తంగా 2 వేలకుపైగా థియేటర్స్‌ లో విడుదల అయిన ఆచార్య సినిమా ఉదయం మొదటి ఆట నుంచే నెగటివ్‌ టాక్‌ మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్‌ విషయంలోనే ఈ సినిమా పెద్దగా బజ్‌ క్రియేట్‌ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్‌–2 సినిమాలు వచ్చిన తర్వాత అతి తక్కువ బుకింగ్స్‌ అందుకున్న పెద్ద సినిమాల్లో ఆచార్య నిలవడం విశేషం.

రాజమౌళి బ్యాడ్‌ సెంటిమెంట్‌
ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సినిమా రిజల్ట్‌పై మాత్రం ప్రస్తుతం అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా రివ్యూల పరంగా చూస్తే బాక్సాఫీస్‌ వద్ద తేడా కొట్టేసి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిజల్ట్‌ విషయంలో రాజమౌళి బ్యాడ్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయినట్లు అనిపిస్తోంది.

రాజమౌళితో చేసిన తరువాత

 

SS Rajamouli

అసలు రాజమౌళికి ఈ సినిమా రిజల్ట్‌కు సంబంధం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే.. సాధారణంగా రాజమౌళితో ఏ హీరో అయినా సరే పెద్ద సినిమా చేస్తే చాలు ఆ తరువాత అతని నుంచి వచ్చే సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌ అయ్యే సెంటిమెంట్‌ కొనసాగుతోంది. ఎన్టీఆర్‌ స్టూడెంట్‌ నెంబర్‌ 1 తరువాత సుబ్బు, సింహాద్రి తరువాత ఆంధ్రావాలా, యమదొంగ తరువాత కంత్రి డిజాస్టర్‌ అయ్యాయి.

అందరికీ అదే తరహాలో..

నితిన్‌ సై తరువాత అల్లరి బుల్లోడు, ప్రభాస్‌ ఛత్రపతి తరువాత పౌర్ణమి, బాహుబలి అనంతరం సాహో తేడా కొట్టేశాయి. రవితేజ విక్రమార్కుడు తరువాత ఖతార్నాక్, రామ్‌ చరణ్‌ మగధీర తరువాత ఆరెంజ్‌ ఇలా పెద్ద సినిమాల అనంతరం రాజమౌళితో వర్క్‌ చేసిన ప్రతీ హీరో కూడా ఆ తరువాత సినిమాతో డిజాస్టర్‌ చూస్తున్నారు

ఆచార్య విషయంలో కూడా..

ఇక రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అనంతరం అతని నుంచి వస్తున్న ఆచార్య సినిమా కూడా అలాంటి టాక్‌ సొంతం చేసుకోవచ్చు అనే టాక్‌ ముందు నుంచే ఉంది. ఇక ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ను గుర్తు చేసుకున్న మెగాస్టార్‌ ఆ సెంటిమెంటును బ్రేక్‌ చేస్తుందని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆచార్య సినిమాకు వస్తున్న రిజల్ట్‌ ను చూస్తుంటే మెగా అంచనాలు రివర్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా చూసిన పలువురు వారి అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా బాగుందని కొందరు, యావరేజ్, బాగోలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

నైజాంలో ఫస్ట్‌ డే కలెక్షన్స్

టాలీవుడ్‌లో బడా హీరో సినిమా విడుదలైతే.. ఆ రచ్చే వేరుగా ఉంటోంది. మొదటి రోజు బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు మోత మోగడం ఖాయం. తాజాగా విడుదలైన చిరంజీవి, రామ్‌ చరణ్‌ల ’ఆచార్యా’ మరోసారి ఇదే జరిగింది. ఆచార్య రిలీజ్‌తో తెలుగులో మరోసారి రికార్డుల వేట మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో మొదటి రోజు రూ.7.90 కోట్లతో టాప్‌ 10లో ఉంది. ఇద్దరు మెగాహీరోలున్న ఈ సినిమాకు ఇంత తక్కువ ఓపెనింగ్స్‌ రావడంపై చర్చ మొదలైంది.

Also Read:Machilipatnam: తండ్రి స్థానంలో ఉన్న వాడే కీచకుడిగా మారితే..

Recommended Videos:

Tags