Bheemla Nayak Nizam Record: మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ..ముఖ్యంగా యూత్ మరియు మాస్ లో పవన్ కళ్యాణ్ కి ఉండే ఫాలోయింగ్ వేరే లెవెల్..ఓపెనింగ్స్ విషయం లో టాక్ తో సంబంధం లేకుండా దిమ్మ తిరిగే వసూళ్లు బట్టే హీరో ఈయన మాత్రమే..OTT కి మరియు పాన్ ఇండియన్ మూవీస్ కి బాగా అలవాటు పడిన మన తెలుగు ఆడియన్స్ ని ఒక్క రీమేక్ సినిమా తో థియేటర్స్ వైపు తీసుకొని రావడం ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం అని చెప్పొచ్చు..అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయన చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి రీమేక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి..ఈ రెండు సినిమాలు విడుదల సమయం లో ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భీమ్లా నాయక్ సినిమాకి అయితే మొదటి రోజు నుండే టికెట్ రేట్స్ లేకపోయినా కూడా ఓపెనింగ్స్ లో అద్భుతాలు సృష్టించింది.
ముఖ్యంగా నైజం ప్రాంతం పవన్ కళ్యాణ్ కి మొదటి నుండి బాక్స్ ఆఫీస్ పరంగా ఎంతో స్ట్రాంగ్ జోన్ అని చెప్పొచ్చు..ఈ ప్రాంతం లో ఇటీవల విడుదల అయినా భీమ్లా నాయక్ సినిమా దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ ని మొదటి రోజు వసూలు చేసింది..ఇది నైజం లో ఒక్క ఆల్ టైం రికార్డు..ఈ రికార్డు ని ఒక్క #RRR సినిమా మినహా ఇటీవల వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా దాటలేకపోయింది అంటే పవర్ స్టార్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..భీమ్లా నాయక్ సినిమా తర్వాత వచ్చిన ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం ఈ ప్రాంతం లో మొదటి రోజు దాదాపుగా 10 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక ఆ తర్వాత విడుదల అయినా KGF చాప్టర్ 2 సినిమా కూడా ఇదే స్థాయి వసూళ్లను రాబట్టింది..ఈ రెండు సినిమాల తర్వాత రాబొయ్యే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా భీమ్లా రికార్డుని కొడుతోంది అనుకున్నారు..కానీ ఈ సినిమా కూడా కేవలం 8 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టి భీమ్లా రికార్డుని అందుకోలేకపోయింది.
Also Read: Chiranjeevi: ఆచార్యలో కన్పించని ‘చిరు’ మార్క్..!
ప్రస్తుతం నైజం ప్రాంతం లో టాప్ 5 డే 1 రికార్డ్స్ గా #RRR , భీమ్లా నాయక్ , పుష్ప , KGF చాప్టర్ 2 మరియు వకీల్ సాబ్ చిత్రాలు నిలిచాయి..ఇక మరో రెండు వారాల్లో మన ముందుకి రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అయినా భీమ్లా నాయక్ మొదటి రోజు వసూళ్లను కొడుతుందో లేదో చూడాలి..మే 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి..ఈ అంచనాలు రెట్టింపు చేసేలా మే 2 వ తారీఖున విడుదల చెయ్యబోతున్న ట్రైలర్ ఉండబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ఈ ట్రైలర్ ని చూసే ప్రతి ఒక్కరికి పోకిరి కాలం నాటి మహేష్ గుర్తుకు వస్తాడట..చూడాలి మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను ఎంత వరుకు అందుకుంటుందో.
Also Read: Star Heroine: మత్తులో సర్వం కోల్పోతున్న స్టార్ హీరోయిన్ ?
Recommended Videos: