Shankar : ఒకప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్, కానీ ఇప్పుడు అతని పేరు తీస్తేనే హీరోలు భయపడి పారిపోతున్నారు. ఆ దర్శకుడు మరెవరో కాదు, శంకర్(Shankar Shanmugan). రాజమౌళి లాంటోళ్ళు ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు తీస్తుండొచ్చు కానీ, శంకర్ మూడు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే శంకర్ తో గతం లో మన సూపర్ స్టార్స్ ఒక్క సినిమా చేసే అవకాశం దక్కినా అదృష్టం లాగా భావించేవారు. కానీ రోబో తర్వాత ఆయన తీసే సినిమాల్లో కంటెంట్ తగ్గిపోయింది. ‘ఇండియన్ 2 ‘(Indian 2) తోనే శంకర్ పరిస్థితి అందరికీ అర్థమైపోయింది. షెడ్డుకి వెళ్లే సమయం వచ్చేసింది. మళ్ళీ ఆయన కోలుకోవడం కష్టమే అని అనుకున్నారు. కానీ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్'(Game Changer) చిత్రంతో కం బ్యాక్ ఇస్తాడని బలంగా నమ్మారు అభిమానులు.
ఎందుకంటే పొలిటికల్ జానర్ అనేది శంకర్ స్ట్రాంగ్ జోన్, స్క్రీన్ ప్లే పేకాడేస్తాడు అని అనుకున్నారు. కానీ అర్థం పర్థం లేని లాజిక్స్ తో ఈ చిత్రాన్ని క్రిన్జ్ కంటెంట్ గా మార్చేశాడు. శంకర్ కాకుండా ఎవరితో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేది అనే ఫీలింగ్ రప్పించాడంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆయన ఏ రేంజ్ కళాఖండం తెరకెక్కించాడో. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలు శంకర్ అనే డైరెక్టర్ ఉన్నాడని మర్చిపోయారు. కెరీర్ రిస్క్ లో పడడంతో ఇప్పుడు చిన్న హీరోలతో ఆయన సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రముఖ తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్(chiyaan vikram) తనయుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) తో త్వరలోనే శంకర్ ఒక సినిమా చేయబోతున్నాడట. గతంలో విక్రమ్, శంకర్ కాంబినేషన్ లో అపరిచితుడు, ఐ వంటికి సినిమాలు వచ్చాయి. వీటిలో అపరిచితుడు చిత్రం సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.
కానీ ఐ చిత్రం మాత్రం యావరేజ్ గా ఆడింది, తమిళనాడు లో సూపర్ హిట్ అయింది కానీ, తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో ఫ్లాపుగా నిల్చింది. అయినప్పటికీ కూడా విక్రమ్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రెండు సినిమాలకి నటుడిగా తనని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టినందుకు డైరెక్టర్ శంకర్ పై విక్రమ్ కి ఎనలేని గౌరవం ఉంది. అందుకే ఆయన చేతిలో తన కొడుకు కెరీర్ ని పెట్టేసాడు. కానీ అభిమానులు మాత్రం ప్రస్తుతం ఉన్న శంకర్ ఫామ్ ని చూసి భయపడిపోతున్నారు. పాపం కుర్రాడి జీవితాన్ని నాశనం చెయ్యొద్దని, శంకర్ కొంతకాలం విరామం తీసుకొని కం బ్యాక్ ఇవ్వడం మంచిదని అంటున్నారట కోలీవుడ్ ఆడియన్స్. ప్రస్తుత శంకర్ ద్రుష్టి ఇండియన్ 3 షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా అవ్వగానే ధృవ్ విక్రమ్ తో సినిమా చేసే అవకాశం ఉంది.