Prithviraj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి( Prudhvi ) చుక్కలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈరోజు ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల కిందట ఓ సినిమా ఫంక్షన్ లో పృధ్వి మాట్లాడుతూ వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాయి వైసిపి శ్రేణులు. లక్షలాదిమంది ఒకేసారి విరుచుకు పడడంతో పృథ్వికి చుక్కలు కనిపించాయి. అటు కుటుంబ సభ్యులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో ఒక్కసారిగా ఒత్తిడి పడడంతో స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు పృథ్విరాజ్. ఈరోజు ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తనను టార్గెట్ చేసుకున్నారని.. చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.
* ఎన్నికలకు ముందు జనసేనలోకి
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి బలమైన మద్దతు దారుడుగా ఉండేవారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించారు. సినీ రంగం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పృథ్వికి గుర్తింపు లభించింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ దక్కింది. కానీ అనుచిత ప్రవర్తనతో ఆ పదవిని దూరం చేసుకున్నారు పృథ్వి.
* అప్పట్లో అలా పదవికి దూరం
అయితే ప్రతిష్టాత్మకమైన ఎస్వీబీసీ చైర్మన్ గా ( SVBC chairman )అవకాశం దక్కిన.. సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే తనతో రాజీనామా చేయించడంతో జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఈ ఎన్నికల్లో జనసేన స్టార్ క్యాంపెయినర్ గా ఆ పార్టీకి ప్రచారం చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన పృథ్వీరాజ్ కి మాత్రం ఇంతవరకు పదవి దక్కలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన రాజకీయ విమర్శలు చేసి వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
* సినిమా ఫంక్షన్ లో వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల ఆయన నటించిన లైలా( Laila) సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఫంక్షన్కు హాజరయ్యారు పృథ్వి. ఆయన మాట్లాడుతూ వైసీపీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో 151 గొర్రెలు ఉండేవని.. ఇప్పుడు 11 ఉన్నాయని చెప్పడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆయన టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది తమ ట్వీట్లతో రెచ్చిపోయారు. దీంతో ఆయన ఒత్తిడికి గురయ్యారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈరోజు సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం విశేషం.