Aditi Shankar: సౌత్ ఇండియాలో సినిమా వారసత్వాన్ని అమ్మాయిలు పెద్దగా తీసుకోరు. ఒకవేళ పరిశ్రమకు వచ్చినా నిర్మాతలగానో లేక ఇతర క్రాఫ్ట్స్ ని ఎంచుకుంటారు. హీరోయిన్స్ మాత్రం కారు. అలా ఎవరైనా ప్రయత్నం చేసినా ప్రోత్సాహం ఉండదు. అయితే స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాది ఆమె అరంగేట్రం జరిగింది. కార్తీకి జంటగా వీరుమాన్ అనే టైటిల్ తమిళ చిత్రం చేశారు. ఈ చిత్రానికి సూర్య నిర్మాత కావడం విశేషం.
గ్లామర్ ఫీల్డ్ లో ఎదగాలనుకుంటున్న అదితి సోషల్ మీడియా వేదికగా తన ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో అదితి చేసిన డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. తన తండ్రి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నన్బన్ చిత్రంలో విజయ్-ఇలియానా నటించిన ‘బెల్లీ సాంగ్’ కి ఆమె డాన్స్ చేశారు. ఇలియానా నడుముకు స్పెషల్ క్రేజ్ ఉండేది. ఇది తెలిసిన శంకర్ బెల్లీ డాన్స్ కాన్సెప్ట్ తో ‘ఇలియానా బెల్లియానా’ అనే ఒక సాంగ్ రూపొందించారు.
ఈ సాంగ్ లో ఇలియానా ప్రొఫెషనల్ బెల్లీ డాన్సర్ ని తలపిస్తూ మెస్మరైజ్ చేశారు. ఆ సాంగ్ కి స్టెప్స్ వేస్తూ అదితి శంకర్ వీడియో చేశారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 2012లో విడుదలైన నన్బన్ హిందీ మూవీ 3 ఇడియట్స్ రీమేక్. ఈ చిత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది. శంకర్ కూతురు రెండో చిత్రంగా మావీరన్ చేస్తున్నారు. శివ కార్తికేయన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
ఆ మధ్య హీరోయిన్ ఆత్మిక నెపో కిడ్ అంటూ అదితి శంకర్ ని టార్గెట్ చేసింది. కేవలం స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురన్న కారణంగా హీరోయిన్ అయ్యారంటూ కామెంట్స్ చేశారు. ఆత్మిక కామెంట్స్ ని అదితి తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. మరోవైపు శంకర్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. శంకర్ కెరీర్లో మొదటిసారి టాలీవుడ్ హీరోతో మూవీ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ పొలిటికల్ థ్రిల్లర్ కాగా రామ్ చరణ్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మాత కాగా కియారా అద్వానీ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు.