Homeఎంటర్టైన్మెంట్Director Shankar Daughter: ఆ హీరో తో నటిస్తే ఊరుకోను అంటూ కూతురుకి వార్నింగ్ ఇచ్చిన...

Director Shankar Daughter: ఆ హీరో తో నటిస్తే ఊరుకోను అంటూ కూతురుకి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్

Director Shankar Daughter: సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..మన అందరికి ఆయన సంగతి తెలిసిందే..పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ లేటెస్ట్ వచ్చింది..కానీ శంకర్ గారు మన చిన్నతనం నుండే పాన్ ఇండియన్ సినిమాలు తీస్తూ మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని మరో లెవెల్ కి తీసుకెళ్ళిపొయ్యాడు..టెక్నాలజీ మీద ఆయనకీ ఉన్న పరిజ్ఞానం మరియు విజన్ ఇండియా లో ఏ స్టార్ డైరెక్టర్ కి లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా, అలాగే కమల్ హాసన్ తో భారతీయుడు అనే సినిమా తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..టాలీవుడ్ లో ఇప్పుడు షూటింగ్స్ కి బ్రేక్ రావడం తో శంకర్ ఇండియన్ 2 మిగిలిన షూటింగ్ ని పూర్తి చెయ్యడానికి చెన్నై వెళ్లారు..ఇది ఇలా ఉండగా శంకర్ కూతురు అదితి శంకర్ కూడా ఇటీవలే సినిమాల్లో హీరోయిన్ గా అడుగు పెట్టింది.

Director Shankar Daughter
Director Shankar, Aditi

ఇటీవలే ఆమె ప్రముఖ తమిళ స్టార్ హీరో తో కలిసి నటించిన ‘విరుమాన్’ సినిమా ఇప్పుడు తమిళనాడు స్టేట్ ని ఊపేస్తోంది..బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతూ కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్ ని వసూలు చేసిన సినిమాగా నిలబడే దిశలో అడుగులు వేస్తుంది..అలా హీరోయిన్ గా అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టడం తో అదితి శంకర్ ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి..అయితే ఇప్పుడు కోలీవుడ్ లో ప్రచారం అవుతున్న ఒక వార్త ప్రేక్షకులను షాక్ కే గురి చేస్తుంది.

Also Read: Priyamani Divorce: భర్త తో విడాకులు తీసుకోబోతున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియమణి

Director Shankar Daughter
Director Shankar, Aditi

అదేమిటి అంటే శంకర్ కి తన కూతురు హీరోయిన్ అవ్వడం అసలు ఏ మాత్రం ఇష్టం లేదట..కానీ కూతురు అదేపనిగా పట్టుబడి బ్రతిమిలాడడం తో కాదనలేక ఒకే ఒక్క షరతు మీద ఒప్పుకున్నదట శంకర్..ఆ షరతు ఏమిటిఅంటే కోలీవుడ్ లో ఒక హీరో తో సినిమా చెయ్యకూడదు..ఆ షరతు మీదనైతే సినిమాల్లోకి పోవడానికి ఒప్పుకుంటాను అని చెప్పాడట శంకర్..ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు శింబునే అని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ..శింబు పని చేసిన ప్రతి హీరోయిన్ తో ఎఫైర్ ఉండనే వార్తలు జోరుగా ప్రచారం సాగడం వల్లే శంకర్ ఈ షరతు పెట్టాడని టాక్.

Also Read:Devi Sri Prasad- Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన దేవిశ్రీ ప్రసాద్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version