https://oktelugu.com/

Radhe Shyam: వేరే లెవెల్​లో ప్రభాస్​ యాక్టింగ్​.. ‘రాధేశ్యామ్’​కు తిరుగులేదంటున్న దర్శకుడు

Radhe Shyam: యంగ్ రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది​. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వేచి చూస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ డాక్టర్ యువి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 14, 2021 / 11:30 AM IST
    Follow us on

    Radhe Shyam: యంగ్ రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది​. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వేచి చూస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణం రాజు సమర్పిస్తున్నారు.

    ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రోమోలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో భాగంగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు రాధాకృష్ణ. ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    ఈ సినిమాలో హీరో ప్రభాస్ నటన గురించి స్పందిస్తూ.. రాధేశ్యామ్​కు ప్రభాస్ యాక్టింగ్​ హైలైట్​గా నిలుస్తుందని అన్నారు. కళ్లతో ఫీలింగ్స్​ను పలికించే సత్తా ఉన్న వ్యక్తి ప్రభాస్ అని తెలిపారు. సినిమాలో వేరే లెవెల్​లో యాక్టింగ్​ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్​ది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్​ అని పేర్కొన్నారు.

    ఈ సినిమాతో పాటు ప్రభాస్​ ఆదిపురుష్ సినిమాలోనూ నటిస్తున్నారు. దీంతో పాటు సలార్​ చిత్రంలోనూ కనిపించనున్నారు. ఆదిపురుష్​ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయింది. ఇందులో రాముడి పాత్రలో కనువిందు చేయనున్నారు ప్రభాస్. కాగా, ఈ సినిమాలో కృతి సనన్​ సీత పాత్రలో నటించింది. సైఫ్​ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.