Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh- Charmy Kaur: ఛార్మి నోటి దూల... దర్శకుడు పూరికి కొత్త తలనొప్పులు!

Puri Jagannadh- Charmy Kaur: ఛార్మి నోటి దూల… దర్శకుడు పూరికి కొత్త తలనొప్పులు!

Puri Jagannadh- Charmy Kaur: లైగర్ మూవీ దర్శకుడు పూరి జగన్నాధ్ ఇమేజ్ భారీగా దెబ్బతీసింది. మనోడి టేకింగ్ చూసిన నిర్మాతలు జనగణమన చిత్రాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. పూరి డ్రీం ప్రాజెక్ట్ దారుణమైన పరిస్థితుల్లో ఆగిపోయింది. సినిమాకి ఉన్న హైప్ చూపి అత్యధిక ధరలకు లైగర్ హక్కులు అమ్మారు. మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో కనీసం 50 శాతం రికవరీ కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లైగర్ కొన్న బయ్యర్లకు తీవ్ర నష్టాలు మిగిలాయి. దీంతో దర్శక నిర్మాతగా ఉన్న పూరి నష్టాలు పూడ్చాలని డిమాండ్ చేశారు.

Puri Jagannadh- Charmy Kaur
Puri Jagannadh- Charmy Kaur

దీనికి పూరి జగన్నాధ్ సైతం ఒప్పుకోవడం జరిగింది. అయితే లైగర్ విడుదలై రెండు నెలలు దాటిపోయినా పూరి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. బయ్యర్లకు హామీ ఇచ్చిన మొత్తం తిరిగి చెల్లించలేదు. దీంతో వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. అక్టోబర్ 27న పూరి జగన్నాధ్ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ వార్త పూరి జగన్నాధ్ వరకూ చేరింది. ఆయన కొంచెం పరుష పదజాలంతో ధర్నా చేస్తా అన్నవారికి వార్నింగ్ ఇచ్చాడు. ధర్నా చేసినవాళ్ళ పేర్లు రాసుకొని ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అంటూ మండిపడ్డాడు.

పూరి ఫోన్లో మాట్లాడిన ఆడియో కాల్ లీక్ కాగా… ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ఈ తలనొప్పులన్నింటికీ ఛార్మినే కారణమంటూ ఓ వాదన బయటకు వచ్చింది. ఛార్మి నోరు జారటం వలనే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఒక ప్రైవేట్ పార్టీకి హాజరైన ఛార్మి లైగర్ మూవీతో మాకు ఎలాంటి నష్టం రాలేదు. పైగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో లాభాలు వచ్చాయి. మేము హ్యాపీగా ఉన్నామని చెప్పారట. ఈ మాట మెల్లగా బయ్యర్ల వరకూ చేరిందట.

Puri Jagannadh- Charmy Kaur
Puri Jagannadh- Charmy Kaur

 

మనం నష్టాలతో ఆర్థికంగా నలిగిపోతే పూరి, ఛార్మి మాత్రం చక్కగా లాభాలు ఎంజాయ్ చేస్తున్నారా? అని వాళ్ళు ఆగ్రహానికి గురయ్యారట. ఆ కారణంగానే పూరి ఇంటి మూడు ధర్నా చేయాలనే నిర్ణయానికి వచ్చారట. నచ్చజెప్పి మెల్లగా ఎంతో కొంత ముట్ట చెబుదామని ప్లాన్ లో ఉన్న పూరికి ఛార్మి కారణంగా ఇబ్బందులు తలెత్తాయి అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ టాలీవుడ్ లో ప్రముఖంగా ప్రచారం అవుతుంది. నాకు రావాల్సిన అమౌంట్ ఇంకా రాలేదు, అందుకే ఆలస్యం అవుతుందని పూరి అంటున్నారు. ఇక ఈ లైగర్ పంచాయితీ ఎలా ముగుస్తుందో చూడాలి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version