https://oktelugu.com/

Daana Veera Soora Karna Movie: ఎన్టీఆర్ మూవీ దాన‌వీర‌శూర‌క‌ర్ణ 15రెట్లు లాభాలు తెచ్చిందట‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..?

Daana Veera Soora Karna Movie: పాత్ర ఏదైనా అందులోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టించ‌గ‌ల న‌టుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే అంద‌రికీ ముందుగా గుర్తుకు వ‌చ్చేది సీనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే. ఎందుకంటే హీరోల‌కు అన్ని క్యారెక్ట‌ర్ల‌కు సూట్ కాలేరు. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్ర‌తి పాత్ర‌న పోషించి మెప్పించాడు. ముఖ్యంగా చెప్పాలంటే పౌరాణిక పాత్ర‌ల్లో ఆయ‌న‌కు క‌నుచూపు మేర‌ల్లో కూడా ఎవ‌రూ సాటిరారు. అంత‌లా మెప్పిస్తుంటారు ఆయ‌న‌. ఇలాంటి పౌరాణిక సినిమాల‌తో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 18, 2022 5:41 pm
    Daana Veera Soora Karna Movie

    Daana Veera Soora Karna Movie

    Follow us on

    Daana Veera Soora Karna Movie: పాత్ర ఏదైనా అందులోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టించ‌గ‌ల న‌టుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే అంద‌రికీ ముందుగా గుర్తుకు వ‌చ్చేది సీనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే. ఎందుకంటే హీరోల‌కు అన్ని క్యారెక్ట‌ర్ల‌కు సూట్ కాలేరు. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్ర‌తి పాత్ర‌న పోషించి మెప్పించాడు. ముఖ్యంగా చెప్పాలంటే పౌరాణిక పాత్ర‌ల్లో ఆయ‌న‌కు క‌నుచూపు మేర‌ల్లో కూడా ఎవ‌రూ సాటిరారు. అంత‌లా మెప్పిస్తుంటారు ఆయ‌న‌.

    Daana Veera Soora Karna Movie

    Daana Veera Soora Karna Movie

    ఇలాంటి పౌరాణిక సినిమాల‌తో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన హీరో ఎవ‌రైనా ఉన్నారా అది కూడా ఎన్టీఆర్ మాత్ర‌మే. కాగా ఆయ‌న పూర్తి స్థాయిలో పౌరాణికి పాత్ర చేసిన మూవీ దానవీరశూరకర్ణ. ఇది 1977 జనవరి 14న విడుద‌ల అయింది. దీనికి ప్రొడ్యూస‌ర్ తో పాటు డైరెక్ట‌ర్ గా కూడా ఎన్టీఆర్ చేశారు. పైగా దుర్యోధనుడుతో పాటు కర్ణుడు, కృష్ణుడిగా ఇలా మూడు పాత్రల‌ను పోషించి మెప్పించారు.

    Daana Veera Soora Karna Movie

    Senior NTR in Daana Veera Soora Karna Movie

    ఇక ఈ మూవీలో త‌న కొడుకులు బాలకృష్ణ, హరికృష్ణ కూడా నటించారు. అయితే ఈ మూవీ గొప్ప విజ‌యం సాధించింది. రూ.20 ల‌క్ష‌ల‌తో నిర్మించిన ఈ మూవీ ఊహించ‌ని లాభాల‌ను తీసుకు వ‌చ్చింది. ఆ రోజుల్లోనే 15 రెట్లు లాభాలు తెచ్చిందంటే ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అర్థం చేసుకోవ‌చ్చు. దాదాపు రూ.3 కోట్లకు మీద‌నే వ‌సూలు చేసింది.

    Also Read: సినీ ఇండస్ట్రీ లూప్ హోల్స్ అన్నీ బయటపెడుతున్న మోహన్ బాబు

    దాదాపు నాలుగు గంట‌ల కంటే ఎక్కువ‌గా ఉన్నా స‌రే.. ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డి మ‌రీ ఈ సినిమాను చూశారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో ఇదో పెద్ద రికార్డు. ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ త‌న న‌ట విశ్వ‌రూపంతో మంత్ర ముగ్ధుల్ని చేసేశాడు. 9 సెంట‌ర్ల‌లో దాదాపు 100 రోజులు నిర్విరామంగా ఆడింది ఈ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రికార్డు కేవ‌లం ఈ సినిమా మీద‌నే ఉంది.

    ఇంకో విష‌యం ఏంటంటే ఈ మూవీకి పోటీగా ముగ్గురు హీరోలు న‌టించిన క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కురుక్షేత్రం వ‌చ్చింది. ఇందులో అర్జునుడిగా సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టిస్తే కృష్ణుడు పాత్ర‌లో శోభన్ బాబు, కర్ణుడి పాత్ర‌లో కృష్ణం రాజు న‌టించారు. కానీ ఎన్టీఆర్ న‌ట ప్ర‌భంజ‌నం ముందు ఈ మూవీ తేలిపోయింది. దాంతో ఈ మూవీ ప్లాప్ అయిపోయింది. కానీ దాన‌వీర శూర‌క‌ర్ణ మాత్రం ప్ర‌భంజ‌నాలు సృష్టించింది.

    Also Read: రివ్యూ : “సన్ ఆఫ్ ఇండియా”

    Tags