Daggubati Venkatesh: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ కి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. దగ్గుపాటి రామానాయుడు గారి కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన తొలిసినిమా ‘కలియుగ పాండవులు’ చిత్రం తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా దాదాపుగా కమర్షియల్ సక్సెస్ గా నిలిచి వెంకటేష్ స్క్రీన్ నేమ్ విక్టరీ అని పెట్టుకునేలా చేసింది.
కెరీర్ లో ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు పోషించడంతో పాటుగా , ఆయన చేసినన్ని జానర్స్ ఏ హీరో కూడా చేసి ఉండదు అనడం లో ఎలాంటి అతియోక్తి లేదు. వాటిల్లో ఫ్యామిలీ జానర్ సినిమాలు వెంకటేష్ కి బాగా కలిసొచ్చాయి. అందుకే వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నీరాజనాలు పలుకుతుంటారు. ఇదంతా పక్కన పెడితే వ్యక్తిగతం గా కూడా వెంకటేష్ తన తోటి హీరోలతో ఎంతో మంచి స్నేహం గా ఉంటాడు.
అంతే కాదు, ఆయన ఆధ్యాత్మికతకు ఎంతో దగ్గరగా ఉంటాడు, తనతో పనిచేసే వాళ్లకు కూడా జీవితం యొక్క విలువ గురించి చెప్తుంటాడట. అలా డైరెక్టర్ మారుతీ తో ఆయన ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్న సమయం లో కొన్ని విలువైన విషయాలను పంచుకున్నాడట. మారుతీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ వెంకటేష్ గారు నాకు చెప్పిన ఒక అమూల్యమైన విషయాన్నీ నేను ఎప్పటికీ మర్చిపోను. జీవితం లో మనకి దొరికే ప్రతీ రోజు ఒక బోనస్ లాగ భావించాలి, ఈరోజు మనకి ఇది దొరికింది చాలు రా అనుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతం గా ఉంటుంది. అదే ప్రతీ సారి మనకి ఇది సరిపోదు ఇంకా కావాలి అని సంతృప్తి చెందకపోతే జీవితాంతం వాటిని దక్కించుకోవడానికే ప్రయత్నం చేస్తూ సగం జీవితం అయిపోతుంది, ఉన్నది ఒక్కటే లైఫ్, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి అంటూ ఆయన చెప్పిన జీవిత సత్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది’ అంటూ మారుతి చాలా ఎమోషనల్ కామెంట్స్ చేసాడు.