Director Maruthi: సంతోష్ శోభన్, మెహ్రిన్ హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో చేసిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, సుదర్శన్, అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు చిత్రబృందం. వి సెల్యులాయిడ్, ఎస్కేఎన్లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అయితే ఇటీవలే విడుదలయిన ” మంచి రోజులు వచ్చాయి” చిత్రం సినిమా టాక్ ఎలా ఉంది అని తెలుసుకోడానికి రాజమహేంద్రవరంలో పర్యటించారు చిత్ర బృందం.

రాజమహేంద్రవరం లోని అనుశ్రీ సినిమా థియేటర్ మ్యాట్నీషోలో మారుతి, హీరో సంతోష్ శోభన్, నటులు సుదర్శన్, శ్రీనివాసరావు, నిర్మాత ఎస్‌కేఎన్ సందడి చేశారు. సినిమాను హిట్ చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ బృందం. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ డైరెక్టర్ మారుతి ఈ కథను ఇరవై రోజుల్లో రాసి… 30 రోజుల్లో పూర్తి చేశాం అని చెప్పుకొచ్చారు.
ఈ మూవీని తెరకెక్కించే సమయంలో రెండు దశ కరోనా ఉందని అయినా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాం అని చెప్పుకొచ్చారు. భయం అనే కాన్సెప్ట్‌తో “మంచిరోజులు వచ్చాయి” సినిమా తెరకెక్కినట్లు చెప్పారు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం ఇష్టం లేదని వెల్లడించారు. థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావాలన్న లక్ష్యంతో చిత్రాన్ని ధియేటర్ల లోనే విడుదల చేశామన్నారు. ప్రస్తుతం మారుతి హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.