Director Maruthi: మరో వారం రోజుల్లో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘ది రాజా సాబ్'(The Rajasaab) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా పై మార్కెట్ లో పెద్దగా అంచనాలు నిన్న మొన్నటి వరకు ఉండేవి కాదు. కానీ ఎప్పుడైతే రిలీజ్ ట్రైలర్ వచ్చిందో, అప్పటి నుండి ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టిన రోజు నుండి అభిమానులకు నిరాశే. గ్రాస్ అసలు ముందుకు కదలని పరిస్థితి. ఏ స్టార్ హీరో కి కూడా చూడనంత దరిద్రమైన ప్రీమియర్స్ గ్రాస్ ని ఈ చిత్రానికి చూస్తామేమో అని ప్రభాస్ ఫ్యాన్స్ భయపడ్డారు. కానీ రిలీజ్ ట్రైలర్ వచ్చిన తర్వాత అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పెరిగాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టీ చూస్తే, ఈ చిత్రం కచ్చితంగా 1 మిలియన్ డాలర్ల గ్రాస్ ని అందుకోవచ్చని అంటున్నారు.
ఇది ప్రభాస్ రేంజ్ కి చాలా తక్కువే, కానీ ఆ రిలీజ్ ట్రైలర్ లేకుంటే, ఇంకా దారుణమైన గ్రాస్ వచ్చేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు ఆ చిత్ర డైరెక్టర్ మారుతీ. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుగు ‘మీరు విజయం సాధించకూడదని కొంతమంది మనసులో చాలా గట్టిగా కోరుకుంటున్నారు. రాజాసాబ్ అది పెద్ద డిజాస్టర్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకు వాళ్లకు మీ మీద అంత పగ?, మీరు నాశనం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు’ అని ప్రశ్న అడగ్గా, దానికి మారుతీ సమాధానం చెప్తూ ‘ నేను ఎదిగితే బాగా బిజీ అయిపోతాను, ఇన్ని రోజులు మా రేంజ్ లో ఉన్న డైరెక్టర్, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అనే అభద్రతా భావం వారిలో కలిగి ఉండొచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎవరికీ ఇష్టమొచ్చింది వాళ్ళు కోరుకుంటారు, అందులో వింతేమీ ఉంది. ఒక మనిషి ఎదుగుదల ని చూసి , మిగిలిన వాళ్లకు ఈర్ష్య, ద్వేషం రావడం సహజం. మానవులుగా పుట్టినప్పుడు ఇలాంటి వాటి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇన్ని రోజులు చిన్న సినిమాలు తీసుకుంటున్న నేను , ఒక్కసారిగా ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తే. ఆ మాత్రం బాధ పక్కవారితో ఉంటుంది కదా. అందుకే రాజా సాబ్ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు మారుతీ. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా మిమ్మలను నిరాశపరిస్తే, నా ఇంటికి వచ్చి కొట్టొచ్చు అంటూ, అభ్హిమానులకు తన ఇంటి అడ్రస్ ని కూడా ఇచ్చాడు మారుతీ, సినిమా విజయం పట్ల ఆయన ఆ రేంజ్ నమ్మకం తో ఉన్నాడు. చూడాలి మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుంది అనేది.