Director Maruthi Father Passed Away: తెలుగు చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల దర్శకుడికి పితృ వియోగం కలిగింది. హిట్ చిత్రాల దర్శకుడు మారుతి తండ్రి ‘కుచల రావు’ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఐతే, నేడు ఆయన మచిలీపట్నంలోని తన స్వగృహంలో కన్నుమూశారు.

కుచల రావు వయసు 76 సంవత్సరాలు. అనారోగ్యంతో పాటు వయోభారంతో ఆయన తుదిశ్వాస విడవడం సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది. తండ్రిని పోగొట్టుకున్న మారుతికి పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారు. మారుతి విజయ గమనంలో ఆయన తండ్రి కుచల రావు పాత్ర చాలా కీలకమైంది.
Also Read: Vijay Devarakonda- Samantha: ఈ రోజు పూజ.. ఎల్లుండు ‘సమంత’తో రొమాన్స్ !
మారుతి దర్శకుడిగా సినిమా రంగ ప్రవేశం చేసి.. గొప్పగా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా.. కుచల రావు గారు చాలా సామాన్యంగానే బతికారు. తన కుమారుడికి ఎంత గొప్ప పేరు వచ్చినా.. ఆయన మాత్రం ఎప్పుడు సింపుల్ గానే కనిపించేవారు. పైగా ఆయన మారుతిని ఎప్పుడు చిన్నపిల్లడిని చూసుకున్నట్లు ఎంతో అపురూపంగా చూసుకునే వారు.
ఏది ఏమైనా ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, దర్శకుడిగా మారుతి ఈ రోజు గొప్ప స్థాయికి ఎదిగారు అంటే.. దానికి ముఖ్య కారణం కుచల రావు గారే.

మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున కుచల రావు గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read:Star Directors: ఒక్క ఛాన్స్ తో వందల కోట్లు కొల్లగొట్టింది వీళ్ళే !
Recommended Videos: