https://oktelugu.com/

Murari Movie : ‘మురారి’ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్ కృష్ణ వంశీ..ఈసారి హీరో ఎవరంటే!

కాబట్టి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో ఆ సినిమాకి సీక్వెల్ వర్కౌట్ అవ్వదు అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 12, 2024 / 10:28 PM IST

    Krishna vamshi murari

    Follow us on

    Murari Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ చిత్రం గా నిల్చిన మురారి చిత్రాన్ని రీసెంట్ గానే మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన వసూళ్లను రాబడుతూ ఆల్ టైం రికార్డుని నెలకొల్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు వస్తాయని, జనాలు ఇంతలా బ్రహ్మరథం పడుతారని మహేష్ బాబు అభిమానులు కూడా ఊహించలేకపోయారు. కేవళంమూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నిన్న మొన్నటి వరకు రీ రిలీజ్ చిత్రాలలో అన్ బీటబుల్ గా ఉన్న ఖుషి క్లోసింగ్ గ్రాస్ ని ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే అధిగమించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ‘కల్కి’ చిత్రం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సినిమా రాకపోవడం వల్ల ఆ గ్యాప్ ని మురారి చిత్రం బాగా ఉపయోగించుకుంది.

    టీవీ టెలికాస్ట్ లో ఈ చిత్రాన్ని మనం చిన్నతనం నుండి ఎన్ని సార్లు చూసి ఉంటామో లెక్కే లేదు. ముఖ్యంగా ఈ చిత్రం లోని సన్నివేశాలు, హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సందర్భాలు, మన ఇంట్లో జరిగే వాస్తవ సంఘటనలు నెమరు వేసుకునేలా ఉంటాయి. అంతే కాకుండా మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన ప్రతీ పాట ఒక ఆణిముత్యం లాగ ఉంటుంది. ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడు’ అనే పాట ప్రతీ పెళ్లి ఫంక్షన్ లోనూ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలా ఎన్నో క్లాసికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టే ఆడియన్స్ రీ రిలీజ్ లో కూడా ఇంతలా బ్రహ్మరథం పట్టారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో అభిమానులు ఈ చిత్ర దర్శకుడు కృష్ణ వంశీ ని ట్యాగ్ చేస్తూ, మా మహేష్ బాబు కెరీర్ లో చిరకాలం పదిలంగా దాచుకునే అందమైన చిత్రాన్ని ఇచ్చారు. ఈ సినిమాకి మీరు సీక్వెల్ చేస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవుతుంది అని ట్యాగ్ చెయ్యగా, దానికి కృష్ణ వంశీ సమాధానం చెప్తూ ‘మహేష్ బాబు రాబొయ్యే రోజుల్లో ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడు. ఆయన స్టాండర్డ్స్ ఇలాంటి సినిమాలు సరిపడవు.

    మురారి సీక్వెల్ కి సరిపడా స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. మహేష్ అవకాశం ఇస్తే ఆ సినిమాని గౌతమ్ తో చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అద్భుతమైన ఆలోచన అంటూ మహేష్ బాబు అభిమానులు కూడా కృష్ణవంశీ ని ప్రశంసించారు. అయితే కృష్ణ వంశీ మురారి చిత్రంతో ఇంతకు మించి అద్భుతమైన కుటుంబ కథా చిత్రం తియ్యలేము అనే తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాని అనుసరిస్తూ ఎన్నో వందల సినిమాలు తెరకెక్కాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో ఆ సినిమాకి సీక్వెల్ వర్కౌట్ అవ్వదు అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.