Director Krish Ghaati: ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) తెరకెక్కించిన ‘ఘాటీ'(Ghaati Movie) మూవీ కి సంబంధించిన టీజర్ మీకు గుర్తుందా..?. హీరోయిన్ అనుష్క(Anushka Shetty) ని ప్రధాన పాత్రలో చూపిస్తూ విడుదల చేసిన ఈ టీజర్ లో అనుష్క ని ఎంత వయొలెంట్ లేడీ గా చూపించాడో అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?, కానీ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని జనాలు పూర్తిగా మర్చిపోయే పరిస్థితికి తీసుకొచ్చేలా ఉన్నాడు. టీజర్ తో ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇండస్ట్రీ లో ప్రకంపనలే పుట్టించాడు. కెరీర్ లో ఇప్పటి వరకు ఎంతో సున్నితమైన సినిమాలను తీస్తూ వచ్చిన క్రిష్ లో ఇంత వయొలెంట్ ఆలోచనలు ఉన్నాయా?, అది కూడా హీరోయిన్ తో వయోలెన్స్ చేయించడం ఏంటి అంటూ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అంతా బాగానే ఉంది, కానీ టీజర్ ద్వారా వచ్చిన హైప్ మొత్తాన్ని ఆయన తొందరపాటు చర్యల వల్ల నాశనం చేసేలా ఉన్నాడని సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అప్పటికీ సినిమా ఇంకా పూర్తి కాకపోవడం తో జూన్ 11 కి షిఫ్ట్ అయ్యారు. పోనీ అప్పటికైనా సినిమా పూర్తి అయ్యిందా అంటే లేదు. ఒక డైరెక్టర్ అయ్యుండి, సినిమాని ఎంత సమయం లో పూర్తి చెయ్యగలం అనే కనీసంగా అంచనాలు వేయకపోతే ఎలా? అనేది విశేల్షకుల నుండి వినిపిస్తున్న వార్త. ఇప్పుడు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5 న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కానీ ఆ నెలలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాపై బాహుబలి సిరీస్ కి జనాల్లో ఎంత క్రేజ్ ఉందో , అంతటి క్రేజ్ ఉంది. అందుకే ఈ చిత్రానికి ముందు కానీ, వెనుక కానీ రావడం చాలా డేంజర్. ఎందుకంటే జనాలు మొత్తం ఆ సినిమా గురించే ఎదురు చూస్తుంటారు.
కాబట్టి ఇలాంటి సినిమాలు విడుదలై ఒకవేళ పొరపాటున టాక్ రాకపోతే మొదటి రోజు కూడా థియేటర్స్ నిండడం కష్టమే. అందుకే ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో కానీ, నవంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇన్ని సార్లు ఒక సినిమా వాయిదా పడితే జనాల్లో సదరు సినిమాపై నెగిటివ్ అభిప్రాయం కలుగుతుంది అనేది వాస్తవం. ‘హరి హర వీరమల్లు’ కి అదే జరిగింది. ఈ సినిమా షూటింగ్ ని మధ్యలోనే ఆపేసి క్రిష్ ‘ఘాటీ’ చిత్రానికి షిఫ్ట్ అయ్యాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయితే పవన్ కళ్యణ్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతారు. హరి హర వీరమల్లు మిగిలిన భాగం షూటింగ్ చేసి ఉండుంటే బాగుండేది అని అనుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే క్రిష్ మనుగడకు, ఆయన ప్రతిభకు సవాల్ లాంటిది, ఎంతమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.