https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఆ దర్శకుడు… అంతా భోళా మహిమ!

వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తనను ఫ్యాన్స్ అలాగే చూడాలనుకుంటారని భావించి మెగాస్టార్ తన తర్వాతి సినిమాలు అలాగే ప్లాన్ చేశారు. కానీ రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ దారుణమైన పరాజయాన్ని చూడటంతో చిరంజీవి మరోసారి ఆలోచనలో పడ్డాడు.

Written By:
  • Shiva
  • , Updated On : August 16, 2023 / 10:43 AM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండు దశాబ్దాలు మకుటం లేని మహారాజుగా తెలుగు సినీ పరిశ్రమను ఏలాడు. ఆ తర్వాత రాజకీయాల కోసం సినిమాలు వదిలేసి వెళ్ళాడు. కానీ అక్కడ అనుకున్న స్థాయి సక్సెస్ రాకపోవడంతో పూర్తిగా రాజకీయాలకు రాజీనామా చేసి, మళ్లీ తనకు స్టార్డం ఇచ్చిన సినీ పరిశ్రమ వైపు వచ్చి ఖైదీ 150 సినిమాతో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చాడు.

    అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చే సమయానికి సినిమాలు చూసే ప్రేక్షకుల ఆలోచనలు మారిపోయాయి. మారిపోయాయి అనే కంటే కొత్తతరం వచ్చేయడంతో ఈ మార్పు వచ్చింది. అప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి తమ ఫ్యామిలీ హీరోలతో ఒక రకంగా మెగాస్టార్ పోటీకి సిద్దమయ్యాడు. ఈ దశలో ఎలాంటి సినిమాలు చేయాలి అనే విషయంలో చిరంజీవి ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.

    వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తనను ఫ్యాన్స్ అలాగే చూడాలనుకుంటారని భావించి మెగాస్టార్ తన తర్వాతి సినిమాలు అలాగే ప్లాన్ చేశారు. కానీ రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ దారుణమైన పరాజయాన్ని చూడటంతో చిరంజీవి మరోసారి ఆలోచనలో పడ్డాడు. నిజానికి తన తర్వాతి సినిమాను కూడా ఇదే ఫార్మెట్ లో ఉండేలా కొంత సెంటిమెంట్ మరికొంత కమర్షియల్ ఉండేలా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేశారు.

    డాడీ బ్రో అనే సినిమాను చిరంజీవి కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిసింది. కానీ వరుసగా రీమిక్స్ చేయడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. పైగా భోళా శంకర్ లాంటి డిజాస్టర్ చూసిన తర్వాత మరో రీమేక్ జోలికి చిరంజీవి వెళ్లాలని అనుకోవడం లేదు.. దీనితో మరో కథను సిద్ధం చేయమని కళ్యాణ్ కృష్ణ కి చెప్పటంతో కొత్త కథలు కోసం వేట మొదలైంది. నిజానికి కళ్యాణ్ కృష్ణ కూడా గొప్ప కమర్షియల్ దర్శకుడు ఏమి కాడు.

    సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కమర్షియల్ కోణం ఉన్న కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసమని పెద్దగా వాటి జోలికి పోలేదు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కూడా పర్వాలేదు కానీ, కమర్షియల్ మెటీరియల్ తక్కువ. దీనితో నేల టిక్కెట్ అంటూ రవితేజ తో వచ్చి ఏకంగా నేల నాకించాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఆ వెంటనే బంగార్రాజు అనే సినిమా కూడా అనుకున్న స్థాయి సక్సెస్ రాలేదు. ఇలా చూసుకుంటే దర్శకుడి ట్రాక్ కూడా గొప్పగా లేదు. కానీ మెగాస్టార్ అతన్ని నమ్మి ముందుకు వెళ్తున్నాడు మరి ఎలాంటి అవుట్ ఫుట్ వస్తుందో ఏమో అని మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే భయపడుతున్నారు.