తెలుగు సినీ చరిత్రలో మరపురాని రోజు

సినిమాల పరంగా సెంటిమెంట్స్ బాగా పాటిస్తారు నిర్మాత , దర్శకులు. ఒక సినిమా విడుదలై సక్సెస్ అయితే ఆ రోజు కి ఒక ప్రాధాన్యత వస్తుంది. ఫలానా సినిమా ,ఫలానా రోజున విడుదలై ఘన విజయం సాధించింది అంటూ లెక్కలు వేసుకొని మరీ తమ సినిమాలు విడుదల చేస్తుంటారు. ఒక్కోసారి ఆ లెక్క నిజమౌతుంది కూడా … అలాంటిదే ఈ ఏప్రిల్ 28 వ తారీకు. ప్రముఖ దర్శకుడు కె . రాఘవేంద్ర రావు యొక్క సినీ […]

Written By: admin, Updated On : April 28, 2020 5:55 pm
Follow us on


సినిమాల పరంగా సెంటిమెంట్స్ బాగా పాటిస్తారు నిర్మాత , దర్శకులు. ఒక సినిమా విడుదలై సక్సెస్ అయితే ఆ రోజు కి ఒక ప్రాధాన్యత వస్తుంది. ఫలానా సినిమా ,ఫలానా రోజున విడుదలై ఘన విజయం సాధించింది అంటూ లెక్కలు వేసుకొని మరీ తమ సినిమాలు విడుదల చేస్తుంటారు. ఒక్కోసారి ఆ లెక్క నిజమౌతుంది కూడా … అలాంటిదే ఈ ఏప్రిల్ 28 వ తారీకు.

ప్రముఖ దర్శకుడు కె . రాఘవేంద్ర రావు యొక్క సినీ జీవితంలో ఏప్రిల్ 28 మరపురాని రోజని చెప్పొచ్చు. దర్శకుడు కె .రాఘవేంద్ర రావు ని స్టార్ డైరెక్టర్ గా మార్చిన రోజు కూడా ఇదే. అప్పటి దాకా దర్శకుడిగా ఆయన తీసిన సినిమాలు అంతంత మాత్రం గా ఆడాయి. ఆ క్రమంలో నందమూరి తారక రామారావు తో కన్నడం లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన , రాజ్ కుమార్ చిత్రం ” గందధ గుడి ” చిత్రాన్ని రీమేక్ చేసి గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. తన సినీ ప్రస్థానం లో ఊహించని స్థాయి కి ఎదిగాడు. అప్పటిదాకా తెలుగు సినీ ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి, కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన అడవి రాముడు చిత్రం , 43 ఏళ్ల క్రితం ఇదే ఏప్రిల్ 28 న విడుదలైంది. .

విచిత్రం గా అదే ఏప్రిల్ 28 న మరో చారిత్రాత్మక విజయం సాధించిన మరో చిత్రం కూడా విడుదలైంది. హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి నిర్మించిన బాహుబలి 2 విడుదల అయిన రోజు కూడా ఇదే ఏప్రిల్ 28 కావడం మరో విశేషం. 2017 ఏప్రిల్ 28 న విడుదల అయిన బాహుబాలి 2 ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయ్యి నేటికీ తెలుగు సినీ చరిత్ర లో చిరస్థాయిగా నిలిచి పోయింది .