రాష్ట్రానికి కేంద్రం బృందం వస్తోందా?

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కంటే రెట్టింపు కేసులు ఉన్న తెలంగాణాను వెనక్కి నెట్టి ముందుకెళ్లడం ప్రజల్లో ఒకింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం నాటికి పాజిటివ్ కేసులు 1,259కి చేరాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 332, గుంటూరు జిల్లాలో 254, కృష్ణా జిల్లాలో 223 ఈ మూడు జిల్లాలోనే రాష్ట్రంలోని 64.25 శాతం (809) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గోప్యంగా ఉంచుతూ పూర్తి వెల్లడిచడం […]

Written By: Neelambaram, Updated On : April 28, 2020 5:43 pm
Follow us on


రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కంటే రెట్టింపు కేసులు ఉన్న తెలంగాణాను వెనక్కి నెట్టి ముందుకెళ్లడం ప్రజల్లో ఒకింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం నాటికి పాజిటివ్ కేసులు 1,259కి చేరాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 332, గుంటూరు జిల్లాలో 254, కృష్ణా జిల్లాలో 223 ఈ మూడు జిల్లాలోనే రాష్ట్రంలోని 64.25 శాతం (809) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గోప్యంగా ఉంచుతూ పూర్తి వెల్లడిచడం లేదని అన్ని విపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. సీఎం తొలిసారి లాక్ డౌన్ ముగిసే సమయంలో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో మాత్రమే వైరస్ ప్రభావం ఉందని, కేసులు లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ తొలగించాలని ప్రధానికి సీఎం జగన్ వివరించడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఈ వాదనలను ఖండిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించడం జరుగుతుందని చెబుతోంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితి ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించకపోవడంతో అక్కడ వైరస్ ప్రభావం అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఇటీవల రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ కేసులు దాస్తోందని టిడిపి, బీజేపీ, సీపీఐ పార్టీలు విమర్శిస్తున్నాయి. బీజేపీ నాయకులు ఆ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేసుల సంఖ్యను దాచే యత్నం చేయవద్దని సీఎస్ లను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణా లోను కేంద్ర బృందం పర్యటిస్తోంది. మే 3న రెండవ విడత లాక్ డౌన్ గడువు ముగియడంతో తదనంతర నిర్ణయాలు తీసుకోవడం కోసం కేంద్రానికి దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉండటంతో రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన ఖాయంగా తెలుస్తోంది.