Director K Raghavendra Rao: దర్శకుడు కె. రాఘవేంద్రరావుకి తెలుగుదేశం పార్టీకి వున్న అనుబంధం తెలిసిందే. ఆ పార్టీ ప్రచారానికి మాంచి పొలిటికల్ ప్రకటనలు తయారుచేసి ఇవ్వడం కె. రాఘవేంద్రరావు ఆనవాయితీ. గత ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారాల వీడియోలు షూట్ లు చేసారు. అందుకే రాఘవేంద్రరావు మరోసారి తెలుగుదేశంపార్టీకి తన చేయూత అందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ప్రచారాల వీడియోల రూపంలో కాదు,

తెలుగుదేశం పార్టీ ఆంద్రప్రదేశ్ కి ఏమి చేసింది ?, ముఖ్యంగా చంద్రబాబు విజన్ కారణంగా తెలుగు రాష్ట్రాలకు కలిగిన లాభలు ఏమిటి ?, జగన్ వల్ల తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న నష్టాలు ఏమిటి ? అనే కోణంలో రాఘవేంద్రరావు ఒక స్క్రిప్ట్ దగ్గర ఉండి రాయించారు. పరుచూరి బ్రదర్స్ ఈ స్క్రిప్ట్ రాశారు. ఈ స్క్రిప్ట్ లో ప్రముఖ నటీనటులను పెట్టాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: RRR New Poster Viral: ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ వైరల్.. ఎన్టీఆర్ – చరణ్ మధ్యలో రాజమౌళి
ఒకరకంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఇది ఉపయోగపడుతుంది అని రాఘవేంద్రరావు నమ్మకం. కాకపోతే.. ఈ సినిమాలో హీరో ఎవరు ?, చిన్నాచితకా హీరోలు నటిస్తే.. సినిమా, జనంలోకి వెళ్ళదు. అందుకే.. బలమైన హీరోనే పెట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ ఉన్న హీరో.. ఈ సినిమాలో నటిస్తాడా అంటే ? డౌటే. అందుకే.. మోహన్ లాల్ ను హీరోగా పెట్టుకుని సినిమా చేయాలని రాఘవేంద్రరావు కసరత్తులు చేస్తున్నాడు.

నిజానికి బాలకృష్ణ హీరోగా కూడా ఈ సినిమా చెయ్యొచ్చు. బాలయ్య హీరోగా చేస్తే.. ఫక్తు పొలిటికల్ స్ట్రిప్ట్ అవుతుంది. పైగా అనిల్ రావిపూడి-బాలయ్య సినిమా త్వరలో స్టార్ట్ కాబోతుంది. అందుకే.. బాలయ్యతో సెట్ కాదు. బయట హీరో అయితేనే ఎక్కువమందికి సినిమా రీచ్ అవుతుంది. మరి మోహన్ లాల్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తాడా ?, రాఘవేంద్రరావు దర్శకుడు కాబట్టి.. అంగీకరించే అవకాశమే ఎక్కువ.
ఈ సినిమాలో ఆంధ్రలోని రాజకీయాలతో పాటు అక్కడ ఉన్న ఫేక్ స్కీములను, వర్తమాన సంఘటనలను ఇలా అన్నీ ఈ సినిమాలో దర్శకుడు రాఘవేంద్రరావు చూపించబోతున్నారు. వచ్చే నవంబర్ నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం అయ్యే అవకాశం వుంది. ఆంధ్రలో ఎన్నికల మూడ్ ను బట్టి ఈ సినిమా కాస్త ముందుకు వెనక్కు వెళ్తుందని తెలుస్తోంది.
మోహన్ లాల్ నోట పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు వుంటాయట.