https://oktelugu.com/

Director Deva Katta: రిపబ్లిక్ 2 సినిమా స్టోరీ ఆయన కోసమే రెడీ చేస్తున్న: దర్శకుడు దేవకట్టా

Director Deva Katta: సమాజాన్ని ప్రశ్నించేలా విభిన్న కధాంశాలతో సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు దేవ కట్టాకి ఒక ప్రత్యేక  స్థానం ఉంది. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించాడు దేవ. కాగా ఇటీవల ప్రజాస్వామ్య దేశంలో నిజాయితీగా పనిచేసే అభిరామ్ అనే ఓ ఐఏఎస్ అధికారి కథతో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘రిపబ్లిక్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 22, 2021 / 05:17 PM IST
    Follow us on

    Director Deva Katta: సమాజాన్ని ప్రశ్నించేలా విభిన్న కధాంశాలతో సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు దేవ కట్టాకి ఒక ప్రత్యేక  స్థానం ఉంది. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించాడు దేవ. కాగా ఇటీవల ప్రజాస్వామ్య దేశంలో నిజాయితీగా పనిచేసే అభిరామ్ అనే ఓ ఐఏఎస్ అధికారి కథతో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘రిపబ్లిక్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్ లోనే కాకుండా ఓటీటీలోనూ విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగాన్ని తెరకెక్కించాలని దర్శకుడు దేవకట్టా ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. రాజకీయ, పోలీసు, న్యాయ వ్యవస్థలో ఏదో ఒక అంశంపై రిపబ్లిక్ రెండో భాగం ఉంటుందని దేవకట్టా స్పష్టం చేశారు.

    Director Deva Katta

    Also Read: పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్యర్య త‌ర్వాత ఈడీ ముందుకు వ‌చ్చేది వీరే…

    రిపబ్లిక్​తో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటం వల్ల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్​లో జీ5 ఓటీటీ సంస్థ విజయోత్సవ వేడుకలకు నిర్వహించింది. దర్శకుడు దేవకట్టాతో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నిర్మాత నిహారిక హాజరై కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచున్నారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ రెండో భాగంపై స్పష్టత ఇచ్చారు దేవకట్టా. మరో రెండు నెలల్లో రిపబ్లిక్ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం కథను సిద్దం చేస్తున్నట్లుగా దేవ కట్టా అధికారికంగా ప్రకటించారు. ‘రిపబ్లిక్ 2’ ను పవన్‌తో చేయాలని తాపత్రయపడుతున్న దేవ కట్టాకు ఆ అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం పవన్ కమిటయిన ప్రాజెక్ట్స్ పూర్తవడానికి చాలానే సమయం పడుతుంది. ఈ లోపు మంచి కథ రెడీ చేసుకొని ఒప్పిస్తే ప్రాజెక్ట్ పట్టాలెక్కడం పెద్ద పనేమీ కాదని చెప్పాలి. మరి రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో పవన్ మాట్లాడినా మాటలకే ఇరు రాష్ట్రాల్లో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు, సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

    Also Read: హ్యాట్రిక్ కాంబినేషన్ తో వస్తున్న గోపిచంద్ – డైరెక్టర్ శ్రీవాస్