Director Atlee : కేవలం ఒకటి రెండు సూపర్ హిట్ సినిమాలు పడగానే కొంతమంది డైరెక్టర్స్ తనకు మించి తోపు డైరెక్టర్స్ ఇండియా లోనే లేరు, రాజమౌళి(SS Rajamouli) వంటి వారు కూడా మా ముందు పనికిరారు అనే ధోరణితో ఉంటారు. అలాంటి డైరెక్టర్స్ జాబితాలోకి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Director Atlee) కూడా చేరిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతను తన కెరీర్ లో ఇప్పటి వరకు 5 సినిమాలు చేశాడు. అందులో తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) తో ఏకంగా మూడు చిత్రాలు చేశాడు. ఇతను తన కెరీర్ లో తీసిన బెస్ట్ సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘రాజా రాణి’ చిత్రం మాత్రమే. ఆరోజుల్లో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఆడియన్స్ బోర్ కొట్టినప్పుడల్లా చూస్తుంటారు. ఈ సినిమా తర్వాత ఆయన చేసినవన్నీ హాఫ్ బేకెడ్ సినిమాలే.
Also Read : విరాట్ భయ్యా అదేం కొట్టుడు.. బ్యాట్ ఏమైనా చేతులకు మొలిచిందా?
ముఖ్యంగా విజయ్ తో తీసిన మూడు సినిమాలు, కేవలం విజయ్ స్టార్ స్టేటస్ కారణంగానే మరో లెవెల్ కి వెళ్లాయి. అట్లీ కూడా బాగానే డైరెక్ట్ చేశాడు, కానీ విజయ్ వల్లే బాక్స్ ఆఫీస్ పరంగా అవి చాలా పెద్ద రేంజ్ కి వెళ్లాయి. అలా అట్లీ కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక రీసెంట్ గానే షారుక్ ఖాన్ తో ‘జవాన్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తీసాడు. ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ అట్లీ కళ్ళు నెల వైపు చూడలేదు. ఆకాశం వైపే చూశాయి. ఆ జవాన్ చిత్రం కూడా అంత పెద్ద సూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం షారుక్ ఖాన్ స్టార్ స్టేటస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా కమర్షియల్ ఫార్మటు లో అట్లీ మంచి సినిమాలే తీస్తున్నాడు, కానీ ఆయనకు ఇంత రేంజ్ రావడానికి కారణం మాత్రమే ఈ సూపర్ స్టార్స్.
ప్రస్తుతం ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తో ఒక సినిమా చేయబోతున్నాడు. రేపు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక అప్డేట్ ని అల్లు అర్జున్ పుట్టిన కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ అప్డేట్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘సన్ పిక్చర్స్’ ఒక వీడియో ని కూడా విడుదల చేసింది. అయితే #A6 అని ప్రత్యేకంగా ట్యాగ్ వేయడం పై మాత్రం నెటిజెన్స్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ తన పేరుకి హ్యాష్ టాగ్ తగిలించడు , అలాంటిది నిన్న గాక మొన్న వచ్చిన అట్లీ ఈ రేంజ్ విన్యాసాలు చేయడంపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ఆ విషయంలో మహేష్ బాబు ను ఫాలో అయి తప్పు చేసిన ఎన్టీఆర్…