Krishna District : ఏపీలో ( Andhra Pradesh)నేర నియంత్రణపై దృష్టి పెట్టింది పోలీస్ శాఖ. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రాత్రిపూట నేరాలపై నిఘా పెట్టింది. రాత్రి 11 గంటల తరువాత అకారణంగా రహదారులపై తిరిగిన చర్యలకు ఉపక్రమిస్తుంది. సరైన కారణాలు చూపెడితే కేసులు పెట్టేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ముమ్మర తనిఖీలు చేపడుతూ వస్తోంది. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతోంది. మద్యం తాగి వాహనాన్ని నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతోంది.
Also Read : డైరెక్టర్ అట్లీ తనకు తాను రాజమౌళి ని మించిన డైరెక్టర్ అనుకుంటున్నాడా?
* పెరిగిన డ్రోన్ల వినియోగం..
గత కొద్దిరోజులుగా పోలీస్ శాఖలో( police department) డ్రోన్ల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు సేవిస్తున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది పోలీస్ శాఖ. ఇటువంటి వారి కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మందుబాబులు పట్టుబడుతున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ పరిధిలో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశాల్లో కొంతమంది యువకులు మద్యం సేవిస్తున్నారు. అటువంటివారిని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు.
* సోషల్ మీడియాలో వైరల్..
అయితే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో( social media) వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఆ యువకులు మద్యం తాగుతుండగా.. డ్రోన్స్ ని చూసి వారిచ్చిన రియాక్షన్ కామెడీగా మారాయి. ఆ వీడియోకి మన్మధుడు సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించారు. ఆ వీడియోను కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అయితే ఆ పోస్ట్ పై స్పందించారు మంత్రి నారా లోకేష్. ఆసక్తికర కామెంట్స్ చేశారు. పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గైస్.. నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా.. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అని రాసుకొచ్చారు. మంత్రి లోకేష్ చేసిన ఈ సెటైరికల్ ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : పవన్ కళ్యాణ్ మీకు ఇది తగునా?
జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్న కృష్ణా జిల్లా పోలీస్. గుడివాడ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్నారని గుర్తించి, మద్యం సేవిస్తున్న ఇద్దరిని అదుపులోనికి తీసుకొని, వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. pic.twitter.com/qVfgVG8VMi
— Krishna District Police (@sp_kri) April 6, 2025
Feel sorry for the guys relaxing in the fields. Can't help, because the @appolice100 drones do their job. https://t.co/Ndzmhqfvy1
— Lokesh Nara (@naralokesh) April 7, 2025