Anil Ravipudi , Chiranjeevi
Anil Ravipudi : మన టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) తర్వాత నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనిల్ రావిపూడి(Anil Ravipudi) అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ వచ్చిన ఆయన ‘పటాస్’ చిత్రం తో తొలిసారి డైరెక్టర్ గా మారాడు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చివరి చిత్రం ‘ఆగడు’. ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తి స్థాయి డైరెక్టర్ గా మారిపోయాడు. ‘పటాస్’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ హిట్ అవ్వడం, ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరూ,F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ సినిమాలతో కమర్షియల్ సినిమాలు తీయాలంటే అనిల్ రావిపూడి తర్వాతే ఎవరైనా అని అనిపించుకునే రేంజ్ కి ఎదిగాడు. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రంతో ఆయన ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడంతో ట్రేడ్ మొత్తం షాక్ కి గురైంది.
ఒకవిధంగా చెప్పాలంటే ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఈ సినిమా మన టాలీవుడ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఆయన సాహు గరిపాటి నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన రెమ్యూనరేషన్ దాదాపుగా పాతిక కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. అంతే కాకుండా లాభాల్లో కొంత వాటాలు కూడా అందుకోబోతున్నాడట. అనిల్ రావిపూడి రెమ్యూనరేషనే ఈ రేంజ్ లో ఉంటేకే ఇక మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అనిల్ రావిపూడి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం ఇదేనని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రంతో అనిల్ రావిపూడి ఏకంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ పై కన్నేశాడు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది కాబట్టి, టాక్ వస్తే కచ్చితంగా ఆ రేంజ్ వసూళ్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఈ చిత్రం స్క్రిప్ట్ దశలోనే ఉందట. రానున్న నాలుగు నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అని నిర్మాత సాహు ‘లైలా’ మూవీ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ‘లైలా’ చిత్రంతో నిండా మునిగిపోయిన నిర్మాత సాహు, ఈ చిత్రం మీదనే కోటి ఆశలు పెట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయి కామెడీ చేసి చాలా రోజులైంది. అభిమానులు వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్ ని బాగా మిస్ అవుతున్నారు . ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కామెడీ టైమింగ్ ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో లేదు. అందుకే ఈ చిత్రం ద్వారా అనిల్ రావిపూడి ‘చంటబ్బాయి’ కాలం నాటి చిరంజీవిని మరోసారి మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు.