https://oktelugu.com/

Jupally Krishna Rao : రేవంత్ పేరు మర్చిపోయిన తెలంగాణ మంత్రి.. “ముఖ్యమంత్రి కేటీఆర్ గారు” అంటూ నాలుక కరుచుకున్న వైనం.. వీడియో వైరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. మొదట్లో బయట వ్యక్తులు.. ఇప్పుడు సొంత పార్టీ నాయకులు ఆయనను అవమానాలకు గురి చేస్తున్నారు.. ఇప్పుడు ఈ జాబితాలో ఓ మంత్రి కూడా చేరిపోయారు.

Written By: , Updated On : February 18, 2025 / 09:13 PM IST
Minister Jupally Krishna Rao

Minister Jupally Krishna Rao

Follow us on

Jupally Krishna Rao : పుష్ప సినిమా విడుదలైనప్పుడు.. ఆ సినిమా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును హీరో అల్లు అర్జున్ మర్చిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. ఇక ఆ మధ్య సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి.. కిరణ్ కుమార్ రెడ్డి పేరును సంబోధించారు. ఆ తర్వాత సారి చెప్పారు. ఇప్పుడు ఈ జాబితాలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిపోయారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అన్యపదేశంగా ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అని వ్యాఖ్యానించారు. తర్వాత వెంటనే నాలుక కరుచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో గులాబీ శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. ” ముఖ్యమంత్రికి సొంత పార్టీ నాయకులే గౌరవం ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కి కలగడం దారుణం. మొన్న అల్లు అర్జున్ పేరు మర్చిపోతే జైలుకు పంపించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేరు సంబోధిస్తే మందలించారు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కేటీఆర్ ను ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావును కూడా కేబినెట్ నుంచి బయటికి పంపిస్తారా” అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేటీఆర్

జూపల్లి కృష్ణారావు కేటీఆర్ పేరు సంబోధించిన వీడియోను.. మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు..” కచ్చితంగా మంత్రి జూపల్లి కృష్ణారావు తన పదవిని కోల్పోతారు. కేబినెట్ నుంచి బయటికి వెళ్లిపోతారు” అంటూ వ్యాఖ్యానించారు. అయితే జూపల్లి కృష్ణారావు ఏదో అనుకోకుండా ముఖ్యమంత్రి కేటీఆర్ అని వ్యాఖ్యానించారని.. ఆయన మనసులో ఎలాంటి భావం లేదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి..” మంత్రి మాట్లాడుకుంటూ ఏదో పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే తప్ప ఇందులో వేరే అర్ధాన్ని వెతకకూడదు. అప్పుడప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. మానవ మాత్రులకు ఇది సహజం. అలాంటప్పుడు దీనిని వ్యతిరేక కోణంలో చూడాల్సిన అవసరం లేదు. భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంలో ఉంది కాబట్టి.. గాలి పోగేసి సోషల్ మీడియాలో ఏదేదో ప్రచారం చేస్తోంది. అంత తప్ప దీని వల్ల పెద్దగా అయ్యేది ఏముండదు. ఇలాంటి ప్రచారం గతంలో కూడా చేశారు. అయినప్పటికీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు. త్వరలో స్థానిక ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వానికి పట్టం కడతారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారినే గెలిపిస్తారని” హస్తం పార్టీ నాయకులు అంటున్నారు.