
చిత్రసీమకు చెందిన పలువురు వరుసగా మృతిచెందడం శోచనీయంగా మారింది. ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ మృతిచెందారు. వీరి మృతివార్త నుంచి ఇంకా కోలుకోకముందే చిత్రసీమకి చెందిన మరొకరు మృతిచెందడం ఆందోళన రెకెత్తిస్తోంది. 2020 సంవత్సరంలో చిత్రసీమలో వరుస మరణాలు చోటుచేసుకుండటంతో చిత్రసీమ కలవరానికి గురవుతోంది.
పాక్ చరిత్రలో తొలిసారి హిందూ పైలట్ నియామకం
ప్రముఖ రచయిత, భోజ్ పురి దర్శకుడు అనిల్ అజితాబ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. గతకొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పాట్నాలోని తన స్వగ్రామంలో నిన్న మృతిచెందారు. ‘జై గంగాజల్’, ‘అపహరణ్’, ‘దిల్ క్యాకరే’ తదితర చిత్రాలకు అసోసియేట్ అనిల్ అజితాబ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి భోజ్‌పురిలో ‘హమ్ బాహుబలి’, ‘రణ్‌భూమి’, ‘ఏక్ దుజే కేలియే’ వంటి పలు చిత్రాలను తెరకెక్కించారు. అనిల్ మృతిపై భోజ్‌పురి, బాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.