Dil Ruba : ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ మైండ్ సెట్ఎలా ఉందంటే, మంచి కంటెంట్ సినిమా ఇస్తే హీరో పేరు కూడా సరిగ్గా తెలియకపోయిన భారీ వసూళ్లను అందిస్తాము, చెత్త కంటెంట్ ని ఇస్తే కనీసం మీరు ప్రొమోషన్స్ కోసం ఖర్చు చేసిన డబ్బులను కూడా రికవరీ చేసుకోలేని రేంజ్ ఫలితాన్ని ఇస్తాము అన్నట్టుగా ఉంది. రీసెంట్ గా విడుదలైన ‘లైలా'(Laila Movie) చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మనమంతా చూసాము, కనీసం వారం రోజులు కూడా థియేటర్స్ లో ఈ సినిమా నిలబడలేకపోయింది. కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు అయినా వచ్చి ఉంటుందా అంటే అనుమానమే. ఆ చిత్రం తర్వాత అతి పెద్ద డిజాస్టర్ సినిమా నిన్న విడుదలైన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘దిల్ రూబ'(Dilruba Movie) అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాకి మొదటి రోజు దారుణమైన ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : దిల్ రూబా ట్విట్టర్ టాక్: కిరణ్ అబ్బవరం మూవీకి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్, ఇంతకీ హిట్టా ఫట్టా?
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కేవలం 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. కిరణ్ అబ్బవరం గత చిత్రం ‘క'(KA Movie) ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ స్టేటస్ ని దక్కించుకుంది. ఆ సినిమా ప్రభావం ‘దిల్ రూబ’ పై కచ్చితంగా ఉంటుందని కిరణ్ అబ్బవరం ఆశపడ్డాడు. కానీ సినిమా విడుదలకు ముందు నుండే ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయింది. ఫలితంగా ప్రొమోషన్స్ తో రకరకాలుగా ఆకట్టుకునే ప్రయత్నం చేసారు కానీ అవి అవి వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ కూడా సినిమా మీద ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగానే ఓపెనింగ్స్ లో ఇంతటి దారుణమైన రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమాకు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 10 లక్షలు , ఓవర్సీస్ నుండి 20 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
ఓవరాల్ గా కోటి 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. ‘క’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకి 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓపెనింగ్స్ ని చూస్తుంటే కనీసం రెండు కోట్ల రూపాయిలు కూడా రికవరీ అయ్యేలా లేదు. సినిమా ప్రొమోషన్స్ కోసం చేసిన ఖర్చు కూడా తిరిగి రావడం కష్టమే. ఒక భారీ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం కి ఇలాంటి స్ట్రోక్ తగలడం అనేది నిజంగా అతను ఊహించనిదే. ‘దిల్ రూబ’ ని చూసిన ప్రతీ ఒక్కరి నుండి వస్తున్న మాట ఏమిటంటే ‘క’ లాంటి సినిమాని తీసి, ఇలాంటి అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ తో రావడం ఏమిటి?, కచ్చితంగా ఈ సినిమా ‘క’ కి ముందే చిత్రీకరించి ఉంటారు అంటూ అంచనా వేస్తున్నారు. కిరణ్ అబ్బవరం కూడా ఇంటర్వ్యూస్ అదే విషయాన్నీ చెప్పడం గుర్తు చేస్తున్నారు.
Also Read : ప్రెస్ మీట్ లోనే నన్ను చిత్తకొట్టేయండి అంటూ సవాల్ విసిరినా ‘దిల్ రూబా’ నిర్మాత..ఇంత నమ్మకం ఏంటో!