Dil Raju: ఎంపీగా దిల్ రాజు పోటీ.. ఏ పార్టీ నుంచి అంటే?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీల సమాయత్తం అవుతోంది. ఈమేరకు కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్ర మంత్రులకు బాధ్యతలను అప్పగించారు.

Written By: Raj Shekar, Updated On : December 30, 2023 6:05 pm

Dil Raju

Follow us on

Dil Raju: తెలంగాణ రాజకీయాల్లోకి ఓ బడా నిర్మాత అడుగు పెట్టబోతున్నారా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారా.. అధికార కాంగ్రెస్‌ టికెట్‌ పై హామీ ఇచ్చిందా.. అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్‌ వర్గాలు.. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో చెప్పలేదు కదూ.. దిల్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఆసినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న దిల్‌ రాజు. కాంగ్రెస్‌ టికెట్‌పై వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నటు‍్ల తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అదే జోష్‌తో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే లోక్‌సభ ఎన్నికల్లోనూ రిపీట్‌ చేయాలనుకుంటోంది. ఈమేరకు ముందు అభ్యర్థులను ప్రకటించేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులతోపాటు సీనియర్‌ నాయకులకు బాధ్యతలు అప్పగించారు.

టికెట్ల కోసం పోటీ..
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీల సమాయత్తం అవుతోంది. ఈమేరకు కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్ర మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నాట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన కాంగ్రెస్‌ను సంప్రదించాలని సమాచారం. దిల్‌ రాజుకు ముఖ్యమంత్రి రేవంత్‌కు సన్నిహితుడా గుర్తింపు ఉంది. ఈమేరకు తన ఆసక్తిని రేవంత్‌ ముందు ఉంచినట్లు తెలిసింది. నిజామాబాద్‌ టికెట్‌ కావాలని కోరినట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అర్వింద్‌ బీజేపీ తరఫు, బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ తరఫున దిల్‌ రాజు బరిలో దిగితే గట్టి పోటీ ఇసా‍్తడని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ..
నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్‌ నుంచి చాలా మందే ఆశిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన ముత్యాల సునీల్‌రెడ్డి, మైనారిటీ కోటాలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ కూడా ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే ఉండనుంది. జాతీయ అంశాలే ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి.

సీఎం హామీ..
నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన దిల్‌ రాజు నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీసీలకు ఇవ్వాలని భావిస్తే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన అనిల్‌ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో బీసీ ఓట్లతోపాటు, పద్మశాలి ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడతాయని కూడా అధిష్టానం ఆలోచిస్తోంది. ఇక తమకు మైనారిటీ ఓట్లు గ్యాంరటీ అన్న అంచనాలు హస్తం పార్టీకి ఉన్నాయి. అయితే ఈసారి బీజేపీ, బీఆర్ఎస్ అభ‍్యర్థులకు దీటైన అభ్యర్థిని బరిలో నిలపాలని మాత్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సామాజికవర్గంతోపాటు, ఆర్థిక అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి.