Credit Cards: టాప్ 10 లో ఉన్న లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డుల వివరాలు.. మీకోసం

దేశంలో ఉన్న వివిధ బ్యాంకులు క్రెడిట్ కార్డులను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇందులో కొన్ని బ్యాంకులు వార్షిక ఫీజు లేదా జాయినింగ్ ఫీజును వసూలు చేస్తుండగా మరికొన్ని బ్యాంకులు మాత్రం ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగానే కార్డులను అందిస్తున్నాయి.

Written By: Suresh, Updated On : December 30, 2023 6:02 pm

Credit Cards

Follow us on

Credit Cards: దేశవ్యాప్తంగా ప్రస్తుతం క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏప్రిల్ లో 8.60 కోట్ల క్రెడిట్ కార్డులు వాడుకలో ఉండగా కొత్త సంవత్సరం 2024 లో సుమారు పది కోట్లకు చేరుతుందని అంచనా.

దేశంలో ఉన్న వివిధ బ్యాంకులు క్రెడిట్ కార్డులను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇందులో కొన్ని బ్యాంకులు వార్షిక ఫీజు లేదా జాయినింగ్ ఫీజును వసూలు చేస్తుండగా మరికొన్ని బ్యాంకులు మాత్రం ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగానే కార్డులను అందిస్తున్నాయి. అంతేకాదు క్రెడిట్ కార్డులను వాడుతూ రికార్డు పాయింట్లు, సైన్ అప్ బోనస్ తో పాటు క్యాష్ బ్యాక్, వోచర్స్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ వంటి ఎన్నో ఆఫర్లను అందుకోవచ్చు.

ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న ఫ్రీ క్రెడిట్ కార్డులెంటో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ పే – ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు.. ఈ -కామర్స్ ప్లాట్ ఫాం అయిన అమెజాన్ లో షాపింగ్ కు ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్డు ఉన్న కస్టమర్లు కలినరీ ట్రీట్స్ ప్రోగ్రామ్స్ ద్వారా దేశంలోని 2500 కంటే ఎక్కువ రెస్టారెంట్లలో డైనింగ్ బిల్లులను సుమారు 15 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఒక శాతం ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపును కూడా పొందవచ్చు. అదేవిధంగా అమెజాన్ ఫ్రైమ్ మెంబర్ షిప్ కలిగి ఉంటే కనుక అమెజాన్ ఇండియాలో కొనుగోళ్లపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. మెంబర్ షిప్ లేని వారు మూడు శాతం క్యాష్ బ్యాక్ ను పొందే ఛాన్స్ ఉంది.

కోటక్ ఫార్చ్యూన్ గోల్డ్ క్రెడిట్ కార్డు.. వ్యాపారుల కోసం ప్రత్యేకంగా బ్యాంకులు ఈ కార్డును అందిస్తున్నాయి. రూ.500 నుంచి రూ.3000 ఇంధన లావాదేవీలపై సుమారు ఒక శాతం ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపును పొందే అవకాశం ఉంది. అలాగే కార్డును కలిగి ఉన్న వారి కుటుంబ సభ్యులు యాడ్ -ఆన్ కార్డును పొందవచ్చు.

ఏయూ ఎల్ఐటీ క్రెడిట్ కార్డు.. ఈ కార్డు ఉన్న వారు 90 రోజుల వ్యవధిలో మూడుసార్లు రెండు నుంచి ఐదు శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఖర్చు చేసిన ప్రతి రూ.100 కు ఒక రివార్డు పాయింట్ తో పాటు రిటైల్ లావాదేవీల కోసం రెండు నుంచి ఐదు శాతం వరకు క్యాష్ బ్యాక్ ను పొందే ఛాన్స్ ఉంది. దాంతో పాటు రూ.400 నుంచి రూ.5000 మధ్య ఇంధన లావాదేవీలపై ఒకశాతం ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపు పొందొచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రైమ్ క్రెడిట్ కార్డు… రోజు వారీ ఖర్చుల నేపథ్యంలో క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కోరుకునే వారికి ఈ కార్డు ఉపయోగకరం. రూ.15 వేలు ఎఫ్డీ చేసిన వారికి ఈ కార్డును బ్యాంకులు అందిస్తాయి. అలాగే లావాదేవీలపై వచ్చే రివార్డు పాయింట్లకు సరిపడా నగదు మొత్తాన్ని క్రెడిట్ కార్డుకు జమ చేస్తారు. ప్రతినెలా రూ.250 వరకు ఇంధన సర్ ఛార్జీ మాఫీ చేయడంతో పాటు రూ.2500 కంటే ఎక్కువ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకోనే అవకాశం ఉంటుంది.

షాపర్స్ స్టాప్ – హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు..
ఈ కార్డు వినియోగదారులు ప్రతి కొనుగోలుపై రివార్డులను పొందవచ్చు. అధికంగా షాపింగ్ చేసే వారికి ఈ క్రెడిట్ కార్డు అనువుగా ఉంటుంది. రూ.400 నుంచి రూ.5000 మధ్య ఇంధన లావాదేవీలపై ఒక శాతం ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపు పొందొచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డు.. ఈ కార్డుదారులు ఇంధనం మినహా రిటైల్ స్టోర్లలో ఖర్చు చేసే ప్రతి రూ.100కు రెండు రివార్డు పాయింట్లను పొందే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా హెచ్పీసీఎల్ పెట్రోల్ పంపుల వద్ద ఒకశాతం ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపును పొందవచ్చు. అలాగే దేశంలోని 12 ప్రధాన నగరాల్లో 2500 కంటే ఎక్కువ రెస్టారెంట్లలో డైనింగ్ పై 15 శాతం ఆదా చేసుకోవచ్చు.

ఐడీఎఫ్సీ ఫస్ట్ సెలక్ట్ క్రెడిట్ కార్డు.. వినియోగదారులకు ఇది లగ్జరీ క్రెడిట్ కార్డు తరహాలో అన్ని ఫీచర్లను అందిస్తుంది. రూ.15 వేలు ఖర్చు చేస్తే రూ.500 విలువైన వోచర్ ను పొందొచ్చు. ఈ కార్డుదారులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది. రూ. కోటి విమాన ప్రమాద కవర్ తో పాటు రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద కవర్, రూ.22,500 సమగ్ర ప్రయాణ బీమా రక్షణ వంటి ప్రయోజనాలను అందుకోవచ్చు.

యాక్సిక్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డు.. కార్డుపై చేసే ప్రతి కొనుగోలుపై ఎడ్జ్ రివార్డ్ పాయింట్లను పొందడంతో పాటు పేటీఎం, మింత్ర వంటి భాగస్వామ్య బ్రాండ్ లపై డిస్కౌంట్స్ పొందే అవకాశం ఉంది. బుక్ మై షో ద్వారా టికెట్స్ కొనుగోలు చేస్తే పది శాతం డిస్కౌంట్ తో పాటు రూ.200 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్ పొందవచ్చు. అలాగు క్రెడిట్ కార్డును గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ లకు లింక్ చేసుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.

ధనలక్ష్మీ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డు.. డిపార్ట్ మెంట్ల స్టోర్ల కొనుగోళ్లతో పాటు సూపర్ మార్కెట్లలో కొనుగోళ్లపై ఐదు శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే దీని ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై రూ. లక్ష వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. దాంతో పాటుగా విమాన ప్రమాద బీమా రూ.20 లక్షల వరకు ఉంది.

ఇండస్ ఇండ్ లెజెంట్ క్రెడిట్ కార్డు.. అన్ని ఆదాయ వర్గాల వారికి సరిపోయే కార్డు. సోమవారం నుంచి శుక్రవారం వరకు చేసే ప్రతి రూ.100 విలువ గల కొనుగోలుపై రివార్డు పాయింట్ ను పొందవచ్చు. శని, ఆది వారాల్లో అయితే రూ.100 కొనుగోలుపై రెండు రివార్డ్ పాయింట్లు పొందుతారు.