
కరోనా కోరల్లో చిక్కుకొని ప్రజందరు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఆనందయ్య చాలా మంది జీవితాల్లో వెలుగు నింపారు. నెల్లుారు జిల్లాకు చెందిన ఈయన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆనందయ్యకు రోజురోజుకు మద్దతు బాగా పెరుగుతోంది. తాజాగా జగపతి బాబు తన ట్విట్టర్ లో కరోనాతో కకావికలం అవుతుంటే ప్రకృతి తల్లి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందేమోనని అనిపిస్తుంది. సహజసిద్ధమైన వైద్యానికి సర్కారు నుంచి అనుమతి రావాలని ప్రార్థిస్తున్నాను. ఈ మందు ప్రపంచాన్ని కాపాడాలి, దేవుడు ఆయనను ఆ రకంగా ఆశీర్వదించాలి అని జగ్గూభాయ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.