Dil Raju ఎల్లుండి దిల్ రాజు(Dil Raju) నిర్మాణం లో నితిన్(Actor Nithin) హీరో గా నటించిన ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా మీద దిల్ రాజు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రొమోషన్స్ కూడా చాలా గట్టిగా చేస్తున్నాడు. ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. సైలెంట్ గా తన సినిమా ప్రొమోషన్స్ ఏవో తాను చేసుకోకుండా ‘గేమ్ చేంజర్’ ప్రస్తావన తీసుకొచ్చి తమ్ముడు చిత్రం పై లేనిపోనీ నెగటివిటీ ని క్రియేట్ చేస్తున్నాడు. దిల్ రాజు అంటే ఒకప్పుడు చాలా తెలివిగా, మాట జారకుండా మాట్లాడే వ్యక్తిగా పేరు ఉండేది. కానీ ఇప్పుడు దిల్ రాజు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయాడు. అయితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘రాజమౌళి గారి స్టైల్ లో తన సినిమాలను తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇంతింతై వతుండతై అనే విధంగా ఎక్కడో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం తో మొదలైన ఆయన, ఇప్పుడు ఈరోజు మహేష్ బాబు తో వరల్డ్ ఫ్లాట్ ఫార్మ్ లో మన తెలుగు సినిమాకి డోర్స్ ఓపెన్ చేయడానికి చూస్తున్నాడు. ఆయన స్కూల్ అలాంటిది’ అంటూ చెప్పుకొచ్చాడు. దిల్ రాజు ఈ కామెంట్స్ చేయడం తో మహేష్ బాబు అభిమానులు ఈ వీడియో బిట్ ని సోషల్ మీడియా అప్లోడ్ చేసి, రాజమౌళి ని ట్యాగ్ చేస్తూ , అసలు ఏమి ప్లాన్ చేసావ్ మా హీరో తో , ఒక్కసారి అధికారిక ప్రకటన చేయొచ్చు కదా, ఆగలేకపోతున్నాం సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత రెండు మూడు రోజుల నుండి విపరీతమైన నెగటివిటీ ని ఎదురుకుంటూ వస్తున్న దిల్ రాజు కి మహేష్ ఫ్యాన్స్ నుండి కాస్త ఈ పాజిటివిటీ రావడం ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది.
మరో పక్క సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ నుండి దిల్ రాజు కి నాన్ స్టాప్ బ్యాటింగ్ జరుగుతూనే ఉంది. బహిరంగంగా మరోసారి రామ్ చరణ్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది అంటూ కాసేపటి క్రితమే వార్నింగ్ ఇస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. సోషల్ మీడియా లో వస్తున్న ఈ నెగటివిటీ ని గమనించి నిన్న సమయం సందర్భం లేకపోయినా కూడా ‘తమ్ముడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ కి ఒక భారీ హిట్ ఇవ్వడం లో విఫలం అయ్యాము, ఆ బాధ మాలో ఇప్పటికే అలాగే ఉంది. కచ్చితంగా రామ్ చరణ్ గారికి భారీ హిట్ మా బ్యానర్ నుండి ఇచ్చే వరకు వదలము, త్వరలోనే మా కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.
Babu range matters#MaheshBabu #SSMB29 pic.twitter.com/hKQfeTHLV1
— S S Karthikeya (@PavanFANofMB) July 1, 2025