Homeఎంటర్టైన్మెంట్దిల్ రాజు పార్టనర్ బోణి అదుర్స్ !

దిల్ రాజు పార్టనర్ బోణి అదుర్స్ !

Dil Raju Partner
ఎంత నమ్మకమైన స్నేహాలు అయినా ఏదొక టైంలో ఏదొక సందర్భంలో వీడిపోక తప్పదు. కాగా దిల్ రాజుతో మొదటి నుంచి కలిసి అటు డిస్ట్రిబ్యూషన్ తో పాటు సినిమా నిర్మాణంలో అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లక్ష్మణ్ ట్రావెల్ అయ్యాడు. నిజానికి దిల్ రాజు ఎదుగుదలలో లక్ష్మణ్ పాత్ర ఎంతో కీలకమైనది. దాదాపు 17 ఏళ్ల పాటు సాగింది ఈ ఇద్దరి పార్ట్నర్ షిప్. ఐతే, ఇప్పుడు ఇద్దరి దారులు వేరయ్యాయి. కారణాలు చాల ఉన్నాయి అని టాక్.

Also Read: RRR సినిమా చూసిన మెగాస్టార్‌.. రాజ‌మౌళితో ఏమ‌న్నాడంటే ?

వాటిల్లో ముఖ్యంగా సినిమా నిర్మాణంలో కొన్ని లెక్కలు కరెక్ట్ గా లేవు అని, దాంతో లక్ష్మణ్ బ్రిడ్జ్ అనే పేరుతో ఆయన సొంతంగా అపార్ట్ మెంట్లు కడుతున్నారు. అదే పేరుతో సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా మొదలుపెట్టి మంచి లాభాలను గడిస్తున్నాడు. తొలి ప్రయత్నంగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన మూవీ…”జాతి రత్నాలు”. ఈ సినిమాకి వచ్చిన టాక్ దెబ్బకు కలెక్షన్ల సునామీ వస్తోంది.

లక్ష్మణ్ నైజామ్, వైజాగ్ ఏరియాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయగా రెండు చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో లక్ష్మణ్ పంట పండింది. బోణి అదుర్స్ అవడంతో సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఆయన ఖుషీగా ఉన్నాడు. దాంతో మరిన్ని సినిమాలను ఆయన పంపిణి చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

Also Read: అనసూయ లైవ్ షో.. ఆ అందం చూడతరమా?

ఇప్పటికే నైజాంలో దిల్ రాజుకి చెక్ పెట్టాడు వరంగల్ శీను అనే కొత్త డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు లక్ష్మణ్ కూడా దిల్ రాజుకి పోటీగా రావడంతో ఓవరాల్ గా దిల్ రాజుకి ఇప్పుడు శత్రువులు ఎక్కువైపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version