Homeఎంటర్టైన్మెంట్Dil Raju: హిట్ కోసం టాలీవుడ్ ను వదిలేసి తమిళులను నమ్ముకుంటున్న దిల్ రాజు

Dil Raju: హిట్ కోసం టాలీవుడ్ ను వదిలేసి తమిళులను నమ్ముకుంటున్న దిల్ రాజు

Dil Raju: ఎఫ్ త్రీ దెబ్బ కొట్టింది. థ్యాంక్యూ సినిమా అడ్డంగా తన్నేసింది. బాలీవుడ్ లో జెర్సీ ప్లాప్ అయింది. హిట్ సినిమా హిందీ రీమేక్ కూడా పరాజయం పాలయింది. సోదరుడి కొడుకుని హీరోగా, అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ పెట్టించి మరీ తీసిన రౌడీ బాయ్స్ నష్టాలను మిగిల్చింది. డిస్ట్రిబ్యూట్ చేసిన మాచర్ల నియోజకవర్గం రెండో రోజే కార్తీకేయ2 దెబ్బకు ఇంటికి వచ్చింది. గుడ్డిలో మెల్లగా బింబిసార లాంటి సినిమా కొంతమేర కాపాడగలిగింది. అయినప్పటికీ దిల్ రాజు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడట్టే ఉంది. చేతిలో లెక్కకు మించి థియేటర్లు ఉన్నప్పటికీ, తెలుగు సినిమా పరిశ్రమని శాసిస్తున్నప్పటికీ.. తాను నిర్మిస్తున్న సినిమాలు అడ్డంగా ఫ్లాఫ్ అవుతుండడంతో దిల్ రాజు కు ఏమీ పాలుపోవడం లేదు. ఇలాంటి సమయంలో తెలుగు దర్శకులను నమ్ముకుంటే పని జరగడం లేదని భావించి ఈసారి తన రూటు తమిళం వైపు మార్చారు. తమిళ దర్శకులను నమ్ముకున్నారు.

Dil Raju
Dil Raju

భారీగా వ్యయం.

శంకర్, రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్లో దిల్ రాజు ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. శంకర్ అంటేనే భారీ చిత్రాలకు పెట్టింది పేరు కాబట్టి దిల్ రాజుతో ఆయన భారీగానే ఖర్చు పెట్టిస్తున్నారు. ఇక తన ఆస్థాన దర్శకుడు వంశీ పైడిపల్లి తో విజయ్ హీరోగా వారసుడు అనే సినిమాని తెలుగు, తమిళంలో రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. ఇవే కాకుండా విశ్వక్సేన్ హీరోగా ఓరి దేవుడా, తెలుగులో నరేష్ నటించి విజయవంతమైన నాంది సినిమా హిందీలో రీమేక్, సమంత హీరోయిన్గా శివలెంక కృష్ణ ప్రసాద్ తో నిర్మిస్తున్న శాకుంతలం సినిమాలు ప్రస్తుతం దిల్ రాజు చేతిలో ఉన్నాయి. అయితే తెలుగు దర్శకులతో మీడియం బడ్జెట్ లోనే దిల్ రాజు సినిమాలు పూర్తి చేస్తారు. కానీ వంశీ పైడిపల్లి ఇందుకు మినహాయింపు. ఇక విజయ్ కి తమిళంలో భారీగా మార్కెట్ ఉండడంతో ఆయనతో కలిసి వారసుడు సినిమాని భారీగానే నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో విజయ్ తో దిల్ రాజుకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అది ఏకంగా మిస్కిన్ తో చేతులు కలిపే స్థాయికి ఎదిగింది.

Also Read: Heroine Priyamani Divorce: సమంత బాటలో ప్రియమణి.. సినీ ప్రముఖుల పెళ్లిళ్లు ఎందుకు నిలబడడం లేదు

Dil Raju
Dil Raju

ఇంతకీ ఎవరు ఈ మిస్కిన్

మిస్కిన్.. బహుశా ఈ పేరంటే తెలియని దక్షిణాది ప్రేక్షకులు ఉండరు కాబోలు. హర్రర్, కాప్ ఇన్వెస్టిగేషన్ సినిమా తీయడంలో మిస్కిన్ తోపు డైరెక్టర్. తమిళంలో ఈయన తీసిన పిశాచి సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. మొదటి సినిమా భారీగా లాభాలు తేవడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా విజయ్ కి మిస్కిన్ మంచి మిత్రుడు కావడంతో తెలుగులో పిశాచి సినిమాను విడుదల చేసేందుకు దిల్ రాజుకు అవకాశం ఇప్పించాడు. దీంతో తన దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. 6 కోట్లకు ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. డిటెక్టివ్, సూపర్ డీలక్స్, బ్యాచిలర్ సినిమాలతో మిస్కిన్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు కావడంతో ఆయన పైనే దిల్ రాజు గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.

Also Read:Tollywood- Dil Raju: టాలీవుడ్ ఫ్లాపులకు కారణం ఎవరు ? దిల్ రాజు ఆధిపత్యానికి చెక్ పడేదెప్పుడు ?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version