spot_img
Homeఎంటర్టైన్మెంట్Dil Raju : సినీ రంగం నుండి తప్పుకోనున్న దిల్ రాజు..చివరి సినిమా అదేనా?

Dil Raju : సినీ రంగం నుండి తప్పుకోనున్న దిల్ రాజు..చివరి సినిమా అదేనా?

Dil Raju : తెలుగు సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయి ఉన్న ఇద్దరు ముగ్గురు నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు చిన్న ఆటో మొబైల్ షాప్ వ్యాపారం తో ఆయన కెరీర్ మొదలైంది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా మొదలై ఎన్నో విజయవంతమైన సినిమాలను తెలంగాణ ఆడియన్స్ కి అందించాడు. అలా డిస్ట్రిబ్యూటర్ గా ఒక స్థాయికి ఎదిగి, డబ్బులను బాగా పోగు చేసుకున్న తర్వాత ఆయన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తో కలిసి నితిన్ తో ‘దిల్’ అనే చిత్రం చేసాడు. తొలిసినిమానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఎంతలా అంటే ‘దిల్’ మూవీ టైటిల్ ని తన ఇంటి పేరుగా పెట్టుకునే రేంజ్ లో అన్నమాట.

ఆ తర్వాత ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారు లోకం, వకీల్ సాబ్ ఇలా ఒక్కటా రెండా ఇండస్ట్రీ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను ఆయన ఎన్నో చేసాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎలాంటి నిర్మాతకి అయినా చెడు కాలం కచ్చితంగా నడుస్తుంది. అన్నీ హిట్ సినిమాలనే తియ్యలేరు. ప్రస్తుతానికి దిల్ రాజు పరిస్థితి అలాగే ఉంది. ఆయన కంపెనీ ఇప్పుడు దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే రీసెంట్ గా ఆయన తీసిన రౌడీ బాయ్స్, థాంక్యూ, ది ఫ్యామిలీ స్టార్, లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఇలా నిర్మాతగా ఆయనకీ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తగిలాయి. అలాగే డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఈమధ్య కాలం లో దిల్ రాజు నైజాం లో కొన్న సినిమాలన్నీ భారీ నష్టాలను మిగిలించాయి.

ప్రస్తుతం ఆయన శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి ఆయన ఇప్పటి వరకు సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు చేసేసాడు. డైరెక్టర్ శంకర్ కేవలం పాటల కోసమే దిల్ రాజు తో 80 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక సినిమాకి ఏ స్థాయిలో ఖర్చు చేసి ఉంటాడో ఊహించుకోవచ్చు. ఇంత భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న ఈ సినిమా హిట్ అయితే దిల్ రాజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. లేదంటే ఇదే ఆయనకీ చివరి సినిమాగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. గేమ్ చేంజర్ చిత్రాన్ని దిల్ రాజు తన 50 వ చిత్రంగా చూస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయి. దిల్ రాజు ఇప్పటి వరకు ఎన్నడూ చూడని లాభాలను చూస్తాడు. మళ్ళీ ఆయన ఇండస్ట్రీ లో చక్రం తిప్పుతాడు. ప్రస్తుతం ఆయన న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని నైజాం ప్రాంతం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయినా కూడా ఆయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే, చూడాలి మరి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
Oktelugu Epaper
Exit mobile version