Vijay Deverakonda: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే పాత్ బ్రేకింగ్ మూవీస్ తో యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). కానీ ఆయన కెరీర్ కేవలం మూడు హిట్ సినిమాలకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన సినిమాలు అత్యధిక శాతం ఫ్లాప్ అయ్యాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’, ‘ఖుషి’, ‘ది ఫ్యామిలీ స్టార్’ ఇలా వరుసగా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. ఇలా వరుస ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ కి మంచి క్రేజ్ యూత్ లో ఇప్పటికీ ఉంది . ఎందుకంటే కుర్రాడిలో టాలెంట్ ఉంది, చూసేందుకు చాలా అందంగా ఉంటాడు, కొడితే కుంభస్థలం బద్దలు అవుతుంది అని అభిమానులతో పాటు ట్రేడ్ కూడా నమ్ముతుంది కాబట్టే యూత్ ఆడియన్స్ ఆయన వెంట నడుస్తున్నారు.
Also Read: #RC16 లోకి కన్నడ సూపర్ స్టార్ ఎంట్రీ..లుక్ టెస్ట్ పూర్తి..అభిమానులకు సెన్సేషనల్ అప్డేట్!
ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వంలో ‘ది కింగ్డమ్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ ని విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ నుండి ఎలాంటి సూపర్ హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారో, అలాంటి సూపర్ హిట్ ఈ చిత్రం ద్వారా వచ్చేస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ రవికిరణ్ అనే దర్శకుడితో, దిల్ రాజు(Dil Raju) బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. రవికిరణ్ గతం లో కిరణ్ అబ్బవరం తో ‘రాజా వారు..రాణి వారు’ అనే సూపర్ హిట్ సినిమా తీసాడు. ఈ చిత్రం ద్వారా కిరణ్ అబ్బవరం, రవికిరణ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. పల్లెటూరు వాతావరణం లో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలాంటి మంచి డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అనే వార్త తెలియగానే అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే నేడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తో ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. అప్పుడు పక్కనే ఉన్న టీం, సార్ మనం ఇంకా టైటిల్ ని ప్రకటించలేదు, పొరపాటున మీరే లీక్ చేసేసారు అని చెప్పగా, ప్రెస్ మీట్ ప్రాంగణం మొత్తం నవ్వులతో నిండిపోయింది. అలా దిల్ రాజు ఫ్లో లో తాను తీయబోతున్న సినిమాకి సంబంధించిన టైటిల్ ని ప్రకటించేశాడు. దీంతో ‘రౌడీ జనార్ధన్’ అనే టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతుంది. లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ మూవీస్ తో కెరీర్ ని కొనసాగిస్తున్న విజయ్ దేవరకొండ, ఈ చిత్రం తో మాస్ లోకి రాబోతున్నాడని అర్థం అవుతుంది.